BREAKING
కృష్ణానదిలో వైభవంగా దుర్గమ్మ తెప్పోత్సవం: హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చిన దుర్గామల్లేశ్వరులు 34వ డివిజన్‌లో సరిపూటి రమణ ప్రచార హోరు.. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థన.. బైరాగి గూడా లో ఘనంగా దసరా వేడుకలు దుర్గామాత సేవలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి జానంపేటలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రేగా ఇంటిపై టి.డి.పి గుండాలదాడి నామినేషన్ తిరస్కరించడంపై పోరెడ్డిని కలిసి రెడ్యం సీఎం నివాసంలో ఆయుధ పూజ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను పరిశీలించిన అసిస్టెంట్ ఎన్నికల అధికారి, కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ కోల్‌కతా తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చెక్కులు అందజేసిన సీఎం సువేందు అధికారి సీఎం ఇంట్లో ఆయుధ పూజ ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరంగా ఘజియాబాద్: వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదికలో భారత్ హవా! ఘనంగా ఆయుధ పూజ ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో భారత నూతన హైకమిషన్ భవన నిర్మాణానికి ఘనంగా భూమి పూజ! MVSR కళాశాల ప్రమాదం: ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు చెందిన ముగ్గురు అరెస్ట్ పిడుగుపాటుకు గురైనా ప్రియుడికి రెండుసార్లు సీపీఆర్ చేసి బతికించిన యువతి: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే పెళ్లి ప్రతిపాదన!

వెంకటాపూర్ లో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం

Select Suryaa Now
వెంకటాపూర్ లో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం

ఘట్‌కేసర్, మేజర్ న్యూస్: శ్రీశ్రీ దేవి శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకునివెంకటాపూర్ లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపం వద్ద మహా చండీ హోమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదమంత్రాలు, ప్రత్యేక పూజలతో మండపం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.ఈ మహా చండీ హోమంలో స్వాములు కందుల నవీన్ కుమార్ ముదిరాజ్, అందే అనంతరావు, చిలుక గణేష్, అందే శ్రీకాంత్, నీరుడి శ్రీనివాస్‌తో పాటు పలువురు  పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు. శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ హోమంతో వెంకటాపురంలో భక్తిమయ వాతావరణం నెలకొంది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని భక్తులు ప్రార్థించారు.