వీధి కుక్కల దాడి: 32 మేక పిల్లలు మృతి
సూర్య- బిక్కనూర్ ;;మండల కేంద్రంలో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక పాడి రైతులు సిద్దిరాములు మరియు రాములు లకు, చెందిన 32 మేక పిల్లలపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో ,అవి మృతి చెందాయి.జీవనోపాధి కోసం పెంచుకుంటున్న మేక పిల్లలు ఒకేసారి మృత్యువాత పడటంతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మండల పశువైద్యాధికారి దివ్యశ్రీ ఘటన స్థలాన్ని పరిశీలించారు. నష్టపోయిన తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా డాక్టర్ దివ్యశ్రీ మాట్లాడుతూ, మృతి చెందిన మేక పిల్లలకు నిబంధనల ప్రకారం పోస్టుమార్టం నిర్వహించి, నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తెలిపారు.అలాగే, మిగిలిన జీవాలకు వీధి కుక్కల బారి నుండి రక్షణ కల్పించుకోవడానికి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.