BREAKING
యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ 'భామ సుందరలో' కొత్త జానపద పాట! 29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ......

వైభవంగా దేవి నవరాత్రి ఉత్సవాలు పూజలు చేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

Select Suryaa Now
వైభవంగా దేవి నవరాత్రి ఉత్సవాలు  పూజలు చేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

కొండాపూర్ ; మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అమ్మవారి మండపాన్ని సందర్శించి దుర్గాదేవిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామం సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు.దేవి నవరాత్రి ఉత్సవాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించడం ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. గ్రామస్థులు, ఉత్సవ నిర్వాహకులు సమష్టిగా వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్లు పవన్ కుమార్, రాజు, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు విఠల్, గోవర్ధన్ రెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, సుధీర్ రెడ్డి, దేవేందర్, పూజారి శంకర్ రెడ్డి, గజాల ప్రభాకర్, సందీప్ గౌడ్, అనంతయ్య, కుమారి దశరథ్, సునుగంటి ప్రభాకర్ గౌడ్, సర్పంచ్ మహేష్, మాజీ ఎంపీటీసీలు నగేష్, ఆంజనేయులు గౌడ్, నోముల వీరేశం, రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు, గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.