వాణి నగర్ లో ప్రజా సమస్యలపై బీజేపీ సమరభేరి…
అమీన్ పూర్;అమీన్ పూర్ జిహెచ్ఎంసి సర్కిల్ పరిధిలోని శ్రీ వాణి నగర్, వేదిరి టౌన్షిప్, దర్శన్ నగర్ ఆర్టీసీ మరియు హెచ్ఎంటి స్వర్ణపురి లో నెలకొన్న రోడ్లు డ్రైనేజీలు మరియు తీవ్రమైన పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అమీన్పూర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు జిహెచ్ఎంసి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.సందర్భంగా బిజెపి అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ... అలాగే వాణి నగర్ పరిధిలో కొందరు నిత్యం అక్రమంగా ఎఫ్డిఎల్ బఫర్ జోన్ లో బోర్లు వేసి మరియు బఫర్ జోన్ల పరిధి నుంచి వాటర్ ట్యాంకర్ల ద్వారా పరిశ్రమలకు నీటిని సప్లై చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే కొనసాగితే భవిష్యత్తులో తీవ్రమైన నీటి కష్టాలు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, ఈ అక్రమాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశాం అని తెలిపారు.మరోవైపు వాణి నగర్ ప్రాంతంలో మద్యం ,బెల్టు షాపులు విచ్చలవిడిగా వేలుస్తుండడంతో పాటు బెల్టు షాపుల బెడద కూడా విపరీతంగా పెరిగిపోయిందని వీటిపై ఎక్సైజ్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన కనీసం పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు.ఈ సమస్యపై ఎమ్మెల్సీ అంజిరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించి తక్షణమే అక్రమ బెల్టు షాపుల అమ్మకాల పై ఎమ్మెల్సీ ని కలిసామని తెలిపారు.ప్రధాన రహదారిపై బెల్ట్ షాప్ ల వల్ల పరిశ్రమలకు వెళ్లే మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కొండ లక్ష్మణ్ ,మహేష్ పోలూరీ ,శ్రీకాంత్, రవి, కొత్తపల్లి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.