ఉత్సవాలకు హాజరుకావాలని ఎంపీకి ఆహ్వానం
సూర్య- బిక్కనూర్ ;;మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన, సీతారామ భద్ర క్షేత్ర ప్రారంభ ఉత్సవాలకు హాజరుకావాలని, పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కార్ కు, శనివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని ఎంపీకి అందజేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కార్ మాట్లాడుతూ రాజ్యాంగ పుస్తకాన్ని తనకు అందించడం అభినందనీయమన్నారు. ఆలయ ఉత్సవాలకు హాజరవుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షెట్కార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంకం రాజు పాటిల్ ఉన్నారు