ఉపాధి పనులు నాణ్యతతో చేపట్టాలి
భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, ఉపాధి హామీ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని జడ్పీ సీఈవో శేషాద్రి సూచించారు. గురువారం మండలంలోని ముల్కనూర్, వంగర, ఎర్రబెల్లి గ్రామాల్లో పర్యటించి వి.బి.జి.ఆర్.ఏ.ఎం.జి. పనులను పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, వేతనదారుల పనితీరును మెరుగుపరచాలని సూచించారు. పనుల అమలులో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీరేశం, ఏపీవో కుమారస్వామి, సర్పంచ్ లు జాలి ప్రమోద్ రెడ్డి, కాలేరు శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్, రామకృష్ణ, హనుమకొండ జిల్లా