తెలంగాణ సంస్కృతికి ప్రతీక.. బతుకమ్మ పండుగ: మర్రి మమతా రాజశేఖర్ రెడ్డి
మల్కాజిగిరి, మేజర్ న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మౌలాలి డివిజన్ పరిధిలోని భరత్ నగర్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకకు మల్కాజి గిరి ఎమ్మెల్యే సతీమణి మర్రి మమతా రాజ శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హజరై స్థానిక మహిశలతో కలిసి పండుగ సంబరాల్లో భాగస్వాములైనారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు, మన సంస్కృతి సంప్రదాయాల ప్రతీక అన్నారు.
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను ప్రజలందరూ ఆనందోత్సా హాలతో, ఐకమత్యంతో జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. మహిళలు పెద్ద సంఖ్య లో పాల్గొని బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ పాటలు పాడుతూ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ వేడుకలో బీఆర్ ఎస్ నాయకులు అమీనుద్ధీన్, గౌలీకర్ శైలేంధర్, గౌలీకర్ దినేష్, గౌలీకర్ జానకీ, గౌలీకర్ పావనీ, గౌలీకర్ షాలినీ, స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మల్కాజిగిరి, మేజర్ న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మౌలాలి డివిజన్ పరిధిలోని భరత్ నగర్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకకు మల్కాజి గిరి ఎమ్మెల్యే సతీమణి మర్రి మమతా రాజ శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హజరై స్థానిక మహిశలతో కలిసి పండుగ సంబరాల్లో భాగస్వాములైనారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు, మన సంస్కృతి సంప్రదాయాల ప్రతీక అన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను ప్రజలందరూ ఆనందోత్సా హాలతో, ఐకమత్యంతో జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. మహిళలు పెద్ద సంఖ్య లో పాల్గొని బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ పాటలు పాడుతూ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ వేడుకలో బీఆర్ ఎస్ నాయకులు అమీనుద్ధీన్, గౌలీకర్ శైలేంధర్, గౌలీకర్ దినేష్, గౌలీకర్ జానకీ, గౌలీకర్ పావనీ, గౌలీకర్ షాలినీ, స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.