తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ఏర్పాట్లు వేగవంతం చేయాలి
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ఏర్పాట్లు వేగవంతం చేయాలి
*ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి
స్కిల్ యూనివర్సిటీ, రేడియల్ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించిన
కందుకూరు: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి (ఐపీఎస్) శుక్రవారం స్కిల్ యూనివర్సిటీ, రేడియల్ రోడ్ వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అనంతరం కేఎంవీ, ఆర్ఎన్ఆర్, రుత్విక్, టీజీఐఐసీ, హెచ్‌జీసీఎల్, ఆర్‌అండ్‌బీ, హెచ్‌ఎండీఏ తదితర సంస్థల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. గ్లోబల్ సమ్మిట్ ప్రారంభానికి ముందే నిర్దేశించిన పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
వివిధ శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తూ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ఎలాంటి జాప్యం లేకుండా పనులను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, ప్రతినిధులను పోలీస్ కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో మహేశ్వరం డిసిపి నారాయణ రెడ్డి, ఏసీపీలు, సిఐ లు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్