సంగారెడ్డి ఎమ్మార్వో కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
సంగారెడ్డి; సంగారెడ్డి ఎమ్మార్వో కార్యాలయంలో శనివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో జయరాం మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పాటలు, ఆటలతో ఎమ్మార్వో కార్యాలయ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. సంప్రదాయ బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.