BREAKING
ఐడి కార్డులు పంపిణీ చేసిన వైసిపి మండల అధ్యక్షులు కొత్త గూడ ఘనంగా విజయదశమి వేడుకలు స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు , కొండారెడ్డిపల్లిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు.. జెమ్మి చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు కల్వకుర్తి దసరా వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి.. రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఘనంగా దేవీ నవరాత్రులు ఈటల రాజేందర్ నివాసంలో ఘనంగా విజయదశమి వేడుకలు వైయస్సార్సీపి జడ్పీటీసీ అభ్యర్థిగా బోల్లెద్దు ప్రతాప్ కుమార్ -ప్రకటించిన వరికూటి భూమా నంద ఆశ్రమంలో వైభవంగా దుర్గమ్మ వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. వికసిత్‌ భారత్ లక్ష్య సాధనలో శ్రీరాముడి స్ఫూర్తిని పొందాలి గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన- సబ్ రిజిస్టర్ కార్యాలయానికి శంకుస్థాపన, స్టేడియం, ఈనెల 26న చలో హైదరాబాద్ కు వేలాదిగా తరలి రండి షాద్‌నగర్ 18వ వార్డులో ఘనంగా జమ్మి పూజ, రావణ దహనం.... స్థానిక ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు వైభవంగా బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామం లో శమి పూజలు...దసరా వేడుకలు...

సింగరేణిలో రూ.3 వేల కోట్ల బొగ్గు స్కామ్‌.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ

Select Suryaa Now
సింగరేణిలో రూ.3 వేల కోట్ల బొగ్గు స్కామ్‌.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ

సూర్య ప్రతినిధి, హైదరాబాద్ :తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన బహిరంగ లేఖ రాశారు. విదేశీ బొగ్గు దిగుమతి పేరుతో సింగరేణి సంస్థలో ఏకంగా రూ.3,000 కోట్ల మేర భారీ కుంభకోణానికి తెరలేపారని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. కృత్రిమంగా బొగ్గు కొరతను, విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించి.. 'భోత్రా లాజిస్టిక్స్' అనే సంస్థతో ప్రభుత్వం రహస్య ఒప్పందం చేసుకుందని కేటీఆర్ మండిపడ్డారు.

ఈ లేఖలో కేటీఆర్ లేవనెత్తిన ప్రధానాంశాలు:

 * రహస్య ఒప్పందాలు బయటపెట్టాలి: విదేశీ బొగ్గు దిగుమతి కోసం చేసుకున్న ఒప్పందాలన్నింటినీ ప్రభుత్వం తక్షణమే బహిర్గతం చేయాలని, భోత్రా లాజిస్టిక్స్ సంస్థను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

 * స్వతంత్ర విచారణ కావాలి: విదేశీ బొగ్గు కొనుగోళ్లు, ఒప్పందాలపై నిష్పాక్షికంగా ఒక స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

 * సింగరేణికి బకాయిలు చెల్లించాలి: రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ.60,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు.

 * దేశీయ సంస్థలకు అన్యాయం: విదేశీ బొగ్గు దిగుమతుల కోసం మన దేశీయ సంస్థల ప్రయోజనాలను, సింగరేణి ఉనికిని పూర్తిగా పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 * కాంగ్రెస్ - బీజేపీ కుట్రలు: తెలంగాణ ఇంధన రంగాన్ని, సింగరేణిని దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న కుట్రలను చూస్తూ ఊరుకోబోమని కేటీఆర్ హెచ్చరించారు.