సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో చిరకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు ముఖ్యమంత్రికి భగవంతుడు మరింత శక్తి, సామర్థ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. ఆయనతోపాటు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రులు సీతక్క, వాకిట శ్రీహరి, రాష్ట్ర పోలీస్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, రోహిన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.