BREAKING
యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ 'భామ సుందరలో' కొత్త జానపద పాట! 29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ......

సర్పంచ్ ముద్ద రాములు మృతి తీరని లోటు : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి

Select Suryaa Now
సర్పంచ్ ముద్ద రాములు మృతి తీరని లోటు  :  మంత్రి  డాక్టర్ వాకిటి శ్రీహరి

మాగనూర్ సూర్య న్యూస్ :

మండలంలోని  కొల్పూర్ లో గ్రామ సర్పంచ్ ముద్ద రాములు ఇటీవల అకాల మరణం చెందడంతో  రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి  శ్రీహరి బుధవారం వారి స్వగృహాన్నికి వెళ్లారు. తీవ్ర దుఃఖంలో ఉన్న సర్పంచ్ కుటుంబ సభ్యులను ఆయన నేరుగా పరామర్శించి, ధైర్యం చెప్పి ఓదార్చారు.

సర్పంచ్ చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి  నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గ్రామాభివృద్ధి కోసం ముద్ద రాములు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ, ఆయన మృతి కొల్పూర్ గ్రామానికి మరియు మండల ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

సర్పంచ్ రాములు కుటుంబం ఒంటరి కాదు. శోకసంద్రంలో ఉన్న ఈ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శివరామిరెడ్డి,స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఆంజనేయులు, సూర్య రిపోర్టర్ మాగనూర్ మండలం