BREAKING
ఐడి కార్డులు పంపిణీ చేసిన వైసిపి మండల అధ్యక్షులు కొత్త గూడ ఘనంగా విజయదశమి వేడుకలు స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు , కొండారెడ్డిపల్లిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు.. జెమ్మి చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు కల్వకుర్తి దసరా వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి.. రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఘనంగా దేవీ నవరాత్రులు ఈటల రాజేందర్ నివాసంలో ఘనంగా విజయదశమి వేడుకలు వైయస్సార్సీపి జడ్పీటీసీ అభ్యర్థిగా బోల్లెద్దు ప్రతాప్ కుమార్ -ప్రకటించిన వరికూటి భూమా నంద ఆశ్రమంలో వైభవంగా దుర్గమ్మ వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. వికసిత్‌ భారత్ లక్ష్య సాధనలో శ్రీరాముడి స్ఫూర్తిని పొందాలి గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన- సబ్ రిజిస్టర్ కార్యాలయానికి శంకుస్థాపన, స్టేడియం, ఈనెల 26న చలో హైదరాబాద్ కు వేలాదిగా తరలి రండి షాద్‌నగర్ 18వ వార్డులో ఘనంగా జమ్మి పూజ, రావణ దహనం.... స్థానిక ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు వైభవంగా బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామం లో శమి పూజలు...దసరా వేడుకలు...

రూ.2.50 లక్షల లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్‌ సహా ముగ్గురు ఏసీబీకి పట్టివేత..!

Select Suryaa Now
రూ.2.50 లక్షల లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్‌ సహా ముగ్గురు ఏసీబీకి పట్టివేత..!
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, కీసర, మేజర్ న్యూస్ (అక్టోబర్ 15): నిషేధిత భూముల జాబితా (22-ఏ) నుంచి భూములను తొలగించే ప్రక్రియ కోసం రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేసి, తొలి విడతగా రూ.2.50 లక్షలు స్వీకరిస్తుండగా కీసర తహసీల్దార్‌ కార్యాలయానికి చెందిన డిప్యూటీ తహసీల్దార్‌ సహా ముగ్గురు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గురువారం కీసర తహసీల్దార్‌ కార్యాలయంలో జరిగిన ఈ దాడికి సంబంధించిన వివరాలను ఏసీబీ రంగారెడ్డి సెంట్రల్‌ జోన్‌ డీఎస్పీ ఎ.పి. ఆనంద్ కుమార్ వెల్లడించారు. ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడి తల్లి, కుటుంబ సభ్యుల పేరిట ఉన్న వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 22-ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్నాయి. వాటిని జాబితా నుంచి తొలగించి సంబంధిత ప్రక్రియ పూర్తి చేసేందుకు కీసర డిప్యూటీ తహసీల్దార్‌ ఆమనగంటి సందీప్ కుమార్ రెడ్డి (ఏఓ-1) రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఆదేశాల మేరకు, వీఆర్వో నన్నూరి విజయ్ కుమార్ రెడ్డి (ఏఓ-3) ప్రోద్బలంతో ప్రైవేటు వ్యక్తి కావలి బాలకృష్ణ గురువారం బాధితుడి నుంచి రూ.2.50 లక్షలు స్వీకరించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. లంచం సొమ్ము స్వీకరించిన వెంటనే దాడి చేసిన ఏసీబీ అధికారులు బాలకృష్ణ వద్ద నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో డిప్యూటీ తహసీల్దార్‌ సందీప్ కుమార్ రెడ్డి, వీఆర్వో విజయ్ కుమార్ రెడ్డి, ప్రైవేటు వ్యక్తి బాలకృష్ణలను అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. కాగా, నెల రోజుల వ్యవధిలోనే కీసరలో మరో ఏసీబీ దాడి జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. గత సెప్టెంబర్‌ 17న కీసర పోలీస్‌ స్టేషన్‌కు చెందిన సీఐ, ఎస్‌ఐలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటన మరువకముందే రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు పట్టుబడటంతో కలకలం రేగింది. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064 కు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ ఆనంద్ కుమార్ సూచించారు.