BREAKING
2027 ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడుతారా.. బీసీసీఐ చీఫ్ కీలక వ్యాఖ్యలు! ఘనంగా పిడికిటి గోపాల్ చౌదరి జన్మదిన వేడుకలు సోషల్ మీడియా వారియర్ పిడికిటి గోపాల్ చౌదరి జన్మదినం శనీశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు అమరవీరుల త్యాగాలు మరువలేనివి కాంగ్రెస్ వైఫల్యాలకు తగిన సమాధానం చెప్పాలి పట్టభద్రుల ఎన్నికల పై ఎం.జి.ఆర్. సూచన వేడుకగా శ్రీవారి ఎదుర్కోలు ఉత్సవం రక్తదాన శిబిరం పాకిస్తాన్ టెస్ట్ జట్టు ప్రకటన.. శ్రీలంక సిరీస్‌కు కొత్త ఆటగాళ్లకు పిలుపు దేవరపల్లిని ఆదర్శ గ్రామం గా తీర్చిదిద్దుతా శిల్పా రావుకు అవమానం.. లైవ్ స్టేజ్‌పై మధ్యలోనే పాట ఆపేయడంతో మండిపడుతున్న ఫ్యాన్స్! పెరవలిలో ఎన్నికల వేడి.. 20 ఎంపీటీసీ స్థానాలకు 102 నామినేషన్లు! అత్యధికంగా వైసీపీ నుంచి 39 నామినేషన్లు.. బానసంధ్య దుకాణాలు తనిఖీ చేసిన డిఎస్పి బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన రౌడీ షీటర్‌కు రిమాండ్ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించిన అధికారులు ఒక నామినేషన్ తిరస్కరణ పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పనపై దృష్టి సారించాలని ఆదేశం.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై పీడీఓలకు.. ఎంపిడిఓ మమత సూచనలు

రోడ్ల పై బైక్ స్టంట్ల పోలీసుల ఉక్కుపాదం

Select Suryaa Now
రోడ్ల పై  బైక్ స్టంట్ల పోలీసుల ఉక్కుపాదం

ప్రమాదకర విన్యాసాలపై ఖమ్మం రూరల్ పోలీసుల ఉక్కుపాదం

స్టంట్లు చేస్తూ పట్టుబడితే కేసులు.. వెంకటగిరి యువకుడిపై చర్యలు

ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : రోడ్లపై బైక్‌లతో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే యువతపై ఖమ్మం రూరల్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. రోడ్లను స్టంట్లకు వేదికగా మార్చుకుని ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ముష్కరాజు హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు బైక్ స్టంట్లపై నిఘా ముమ్మరం చేసిన పోలీసులు.. ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థి ఐతగాని అజయ్ కుమార్ (20)పై కేసు నమోదు చేశారు.

ప్రాణాలతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదు!

బైక్ స్టంట్ల పేరుతో రోడ్లపై హంగామా చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సీఐ స్పష్టం చేశారు. యువత తమ సరదా కోసం ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టడం మానుకోవాలని హితవు పలికారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాలు ఇప్పటికే ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నాయని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రమాదకర విన్యాసాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి ఈ కేసు గట్టి హెచ్చరికగా నిలవాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.