BREAKING
అసత్యంపై ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది: ద్వారక దసరా వేడుకల్లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం! భారత విమానయాన రంగంలో రికార్డుల ప్రస్థానం: 2047 నాటికి 130 కోట్ల ప్రయాణికులే లక్ష్యం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి! సంపద, విజ్ఞానం, శక్తి కలబోసిన భారత్‌గా తీర్చిదిద్దడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం: తజికిస్తాన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ! కొద్ది వారాల్లోనే భారత్-అమెరికా చారిత్రక వాణిజ్య ఒప్పందం: యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన ప్రకటన! ఉగ్రవాదంపై మా భాగస్వామ్య దేశాలు జీరో టాలరెన్స్ చూపించాలి: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ.. తహవ్వుర్ రాణా అప్పగింతపై హర్షం! 'ఉడాన్' పథకానికి పదేళ్లు: దేశవ్యాప్తంగా 1.72 కోట్ల మందికి విమాన ప్రయాణం.. 687 రూట్లతో సామాన్యుడి సొంతమైన ఆకాశం! భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందం అమలు.. ఇరుదేశాల హర్షం! హరిహర క్షేత్రంలో ఘనంగా శమి పూజలు 2029 డిసెంబర్ 31 నాటికి పంజాబ్‌ను ‘నశా ముక్త్’గా మారుస్తాం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన డెడ్‌లైన్! ఎన్నికలు రాగానే పంజాబ్ గుర్తొచ్చిందా?: అమిత్ షాపై భగవంత్ మాన్ ధ్వజం! కాలనేమి కూడా రాముడి నామాన్ని జపించేవాడు: అయోధ్యపై విపక్షాల దుష్ప్రచారంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు! మహారాష్ట్రలో ప్రభుత్వం మారాల్సిందే: దసరా ర్యాలీలో బీజేపీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ధ్వజం! అమెరికాలో 3 లక్షల వీసాల రద్దు.. నేరస్థులపై ఉక్కుపాదం! పాకిస్తాన్, సౌదీ అరేబియాతో చారిత్రక 'మక్కా రక్షణ ఒప్పందం': ధ్రువీకరణ కోసం పార్లమెంటుకు పంపిన టర్కీ ప్రభుత్వం! ఇంధన సంక్షోభంపై మాక్రాన్ వ్యూహం: గల్ఫ్ దేశాల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు

రైతులు యాసంగిలో వరి వేయవద్దు.... ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి దాసరి హరిచందన....

Select Suryaa Now
రైతులు యాసంగిలో వరి వేయవద్దు.... ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి దాసరి హరిచందన....


నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్....
            ఎల్ నినో  పరిస్థితిలను దృష్టిలో ఉంచుకొని రైతులు యాసంగిలో ఎట్టి పరిస్థితులలో వరి వేయవద్దని రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖల కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎల్ నినో  ప్రత్యేక అధికారి దాసరి హరిచందన అన్నారు .
వ్యవసాయం, పంటలు తాగునీరు, విద్యుత్  తదితర అంశాల పై ఎల్ ని నో ప్రభావం పైఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్షించే నిమిత్తం శుక్రవారం ఆమె నల్గొండ జిల్లాకు వచ్చారు. సమీక్ష అనంతరం ఆమె కనగల్ మండలం, శేరి లింగోటం వద్ద నీరు లేక ఎండిపోయిన వరి ,పత్తి పొలాలను పరిశీలించారు.ఈ సందర్భంగా శేరి లింగోటం గ్రామానికి చెందిన  వరి, పత్తి రైతులతో ఆమె ముఖాముఖి మాట్లాడారు.ఎల్ నినో ప్రభావం వల్ల వానాకాలం  సరైన వర్షాలు రావని, అందువల్ల రైతులు  వరి పంట సాగు చేయవద్దని వ్యవసాయ అధికారులు, జిల్లా యంత్రాంగం పదేపదే  రైతులకు చెప్పినప్పటికి  జిల్లాలోని అనేక ప్రాంతాలలో వరి సాగు చేయడం జరిగిందని అన్నారు. వరి పంట చేతికొచ్చే దశలో భూగర్భ జలాలు లేక వరి పంటలు ఎండిపోతున్నాయని, అలాగే  పత్తి పంటలు కూడా ఎండిపోతున్నాయని, దీనివల్ల రైతులకు నష్టం కలుగుతుందని అన్నారు. ఎల్ నినో  వల్ల ఎక్కువనీరు అవసరం అయ్యే పంటలు వేస్తే భూగర్భ జలాల అధిక వినియోగంతో పాటు, విద్యుత్ వినియోగం కూడా తిరుగుతుందని, అంతేకాక ఏదో కారణం చేత పంట చేతికి రాకపోతే రైతు తీవ్రంగా నష్టపోవలసి వస్తుందని, ఈ విషయాలన్నీ సొంతంగా అనుభవించిన రైతులు తోటి రైతులకు వారి అనుభవాలను తెలియజేయాలని, మరో రైతు నష్టపోకుండా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యాసంగిలో జిల్లా రైతులు బోర్లు, బావుల కింద ఎట్టి పరిస్థితులలో వరి వేయవద్దని, దీనివల్ల అన్ని రకాల ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పారు. ఇదే విషయాలు తోటి రైతులతో పాటు, ఇతర ప్రాంతాల రైతులకు కూడా తెలియజేసి వారు నష్టపోకుండా చూడాలని కోరారు.
తక్కువ నీరు అవసరమయ్యే స్వల్పకాలిక పంటలను సాగు చేసుకునేందుకు  ప్రభుత్వం విత్తనాలు, ఇతర  సహకారం అందిస్తుందని తెలిపారు.జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ ,జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ , ఉద్యాన శాఖ అధికారి శేఖర్, ఏఈవోలు , ఇతరులు ఉన్నారు.