BREAKING
భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్-2026 ప్రారంభం చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్! టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ప్రజావాణిలో పురుగు మందు డబ్బాతో రైతు ఆవేదన సముద్ర జీవవైవిధ్య పరిరక్షణకు అత్యంత కీలకం 'అధోజల మహాసముద్రాలు' బహుళ వ్యవస్థా క్షీణత వ్యాధి చికిత్స పరీక్షలను నిలిపివేసిన టెవా ఫార్మాస్యూటికల్స్ ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన.. బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలి - ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోలక్ పల్లి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. కొల్లూరు జాబ్ మేళాకు అనూహ్య స్పందన హంటింగ్టన్ వ్యాధి చికిత్సకు యూనిక్యూర్ జీన్ థెరపీ...మే 1, 2027 నాటికి నిర్ణయం తీసుకోనున్న ఎఫ్‌డీఏ!

రాజ్యాంగ విలువల కోసం పోరాటం కొనసాగిస్తాం...ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Select Suryaa Now
రాజ్యాంగ విలువల కోసం పోరాటం కొనసాగిస్తాం...ఎమ్మెల్యే సంజీవరెడ్డి

సూర్య జాతీయ డెస్క్: ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత మరియు పవిత్రమైన ఓటు హక్కును కాపాడటమే లక్ష్యంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పిలుపు మేరకు దేశ రాజధాని ఢిల్లీలో భారీ నిరసన కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లతో పాటు నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శేట్కర్ మరియు సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి ఢిల్లీకి తరలివెళ్లిన దాదాపు 150 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నాయకులు ప్రదర్శన నిర్వహించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రజాస్వామ్యానికి ప్రధాన పునాది అయిన ఓటు హక్కును పరిరక్షించాల్సిన ప్రాథమిక బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల సంఘం తన రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను విస్మరించి, కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గుతూ వ్యవహరించడం శోచనీయమని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రజల్లో అనుమానాలు కలగకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం తక్షణమే స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంలో విఫలమైన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు “ఓటు చోర్ - మోదీ హటావో, భారత్ బచావో” అనే నినాదాలతో కూడిన బ్యానర్లను ప్రదర్శిస్తూ తమ ఆందోళనను తెలిపారూ. పౌరుల ఓటు హక్కును కాపాడటం, రాజ్యాంగ విలువలను నిలబెట్టడం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతటి పోరాటానికైనా సిద్ధమని సంజీవరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు మరియు పీసీసీ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.