BREAKING
అసత్యంపై ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది: ద్వారక దసరా వేడుకల్లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం! భారత విమానయాన రంగంలో రికార్డుల ప్రస్థానం: 2047 నాటికి 130 కోట్ల ప్రయాణికులే లక్ష్యం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి! సంపద, విజ్ఞానం, శక్తి కలబోసిన భారత్‌గా తీర్చిదిద్దడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం: తజికిస్తాన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ! కొద్ది వారాల్లోనే భారత్-అమెరికా చారిత్రక వాణిజ్య ఒప్పందం: యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన ప్రకటన! ఉగ్రవాదంపై మా భాగస్వామ్య దేశాలు జీరో టాలరెన్స్ చూపించాలి: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ.. తహవ్వుర్ రాణా అప్పగింతపై హర్షం! 'ఉడాన్' పథకానికి పదేళ్లు: దేశవ్యాప్తంగా 1.72 కోట్ల మందికి విమాన ప్రయాణం.. 687 రూట్లతో సామాన్యుడి సొంతమైన ఆకాశం! భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందం అమలు.. ఇరుదేశాల హర్షం! హరిహర క్షేత్రంలో ఘనంగా శమి పూజలు 2029 డిసెంబర్ 31 నాటికి పంజాబ్‌ను ‘నశా ముక్త్’గా మారుస్తాం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన డెడ్‌లైన్! ఎన్నికలు రాగానే పంజాబ్ గుర్తొచ్చిందా?: అమిత్ షాపై భగవంత్ మాన్ ధ్వజం! కాలనేమి కూడా రాముడి నామాన్ని జపించేవాడు: అయోధ్యపై విపక్షాల దుష్ప్రచారంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు! మహారాష్ట్రలో ప్రభుత్వం మారాల్సిందే: దసరా ర్యాలీలో బీజేపీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ధ్వజం! అమెరికాలో 3 లక్షల వీసాల రద్దు.. నేరస్థులపై ఉక్కుపాదం! పాకిస్తాన్, సౌదీ అరేబియాతో చారిత్రక 'మక్కా రక్షణ ఒప్పందం': ధ్రువీకరణ కోసం పార్లమెంటుకు పంపిన టర్కీ ప్రభుత్వం! ఇంధన సంక్షోభంపై మాక్రాన్ వ్యూహం: గల్ఫ్ దేశాల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు

రాజకీయ కక్ష సాధింపు తోనే తప్పుడు కేసు-బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా నారాయణరెడ్డి

Select Suryaa Now
రాజకీయ కక్ష సాధింపు తోనే తప్పుడు కేసు-బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా నారాయణరెడ్డి

కాటారం, మేజర్ న్యూస్, తనకు ఎలాంటి సంబంధం లేని అంశంలో కక్షపూరితంగా కాటారం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం పూర్తిగా రాజకీయ కుట్రని, ఇది ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్టపాలు చేయడమేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్ల నారాయణరెడ్డి మండిపడ్డారు. కాటారం మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నారాయణరెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ అండదండలతో పేదల భూములను లాక్కోవడమే కాకుండా, ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయించడం కాంగ్రెస్ అణచివేత ధోరణికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. గుమ్మళ్లపల్లి గ్రామానికి చెందిన గాడివి రజిత అనే మహిళ కుటుంబానికి దాదాపు 50 ఏళ్ల క్రితం ప్రభుత్వం 5.26 గుంటల సీలింగ్ భూమిని కేటాయించింది. ప్రస్తుత అధికార పార్టీ రాజకీయ బలాన్ని చూసుకుని గ్రామానికి చెందిన కొందరు నాయకులు రజితకు చెందిన ఆ భూమిని అక్రమంగా లాక్కొని దున్నుకుంటున్నారు. దీనిపై సదరు బాధితురాలు అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోకపోవడంతో, ఆవేదనతో ఒక సెల్ఫీ వీడియోను తీసి వాట్సాప్ గ్రూపుల్లో పంచుకుంది.ఈ వీడియోపై అదే గ్రామానికి చెందిన కంకణాల రఘునందన్ ఆ మహిళను బెదిరించగా, భయాందోళనకు గురైన రజిత.. రఘునందన్ భార్య స్వాతిని వ్యక్తిగతంగా దూషించింది. ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన ఈ సివిల్ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా, తానే వెనకుండి మాట్లాడించినట్లు చిత్రీకరిస్తూ కాంగ్రెస్ నాయకులు కుట్రపూరితంగా తనపై కేసు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 38 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ మహిళలను కించపరిచేలా ప్రవర్తించలేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ రాక్షసానందం పొందుతున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా వక్రబుద్ధిని మానుకుని పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో మహాముత్తారం మండల అధ్యక్షులు మేడిపల్లి పూర్ణచందర్, మలహార్ రావు మండల అధ్యక్షులు శ్రీకాంత్, జిల్లా కౌన్సిల్ మెంబర్ బొమ్మన భాస్కర్ రెడ్డి, జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు రఫీ, మాజీ మండల అధ్యక్షులు బండం మల్లారెడ్డి, మండల జనరల్ సెక్రటరీ స్వామి, నాయకులు గోగుల రాజేష్, చీర్ల అశోక్ రెడ్డి, సడువలి తదితరులు పాల్గొన్నారు..
రిపోర్టర్: గోనే సుధాకర్ రెడ్డి, కాటారం, జయశంకర్ భూపాలపల్లి