BREAKING
సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో గంజాయిపై ఉక్కుపాదం**గడిచిన ఏడాదిలో 20 మందిని అరెస్టు చేశాం* మైక్రోసాఫ్ట్ సేవల్లో ప్రపంచవ్యాప్త అంతరాయం: ఔట్‌లుక్, మైక్రోసాఫ్ట్ 365 డౌన్ కావడంతో వినియోగదారుల అవస్థలు బైనాన్స్ క్రిప్టో దొంగతనం కేసులో FBI భారీ స్వాధీనం: కోట్లాది రూపాయల క్రిప్టోకరెన్సీ రికవరీ ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ వన్డే: అరంగేట్రం మ్యాచ్‌లోనే ఆరు వికెట్లతో చెలరేగిన బార్డ్‌మాన్, 131 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్ అధిక ఫీజుల వసూళ్లపై మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్‌తో అమెరికా ప్రతినిధుల కీలక చర్చలు: శాంతి ఒప్పందం దిశగా అడుగులు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సామాజిక న్యాయ ఛాంపియన్ః మంత్రి సీతక్క ఘనంగా భగవాన్ బిర్షముండా 151 వ జయంతి వేడుకలు స్వయంకృత అపరాధంతో ప్రపంచకప్ టికెట్ చేజార్చుకుంటున్న కుల్దీప్ యాదవ్.. కివీస్‌తో మ్యాచ్‌లో చెత్త ప్రదర్శనపై ట్రోల్స్ తైవాన్ చుట్టూ చైనా భారీ సైనిక విన్యాసాలు: 100కు పైగా యుద్ధనౌకల మోహరింపు.. తీవ్ర ఉద్రిక్తత ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ వన్డేలో అద్భుతం.. 38 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన యువ పేసర్ మహ్లీ బార్డ్‌మాన్ నషా ముక్త్ భారత్ అభియాన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ రాజర్షి షా 30 ఏళ్ల గ్రామస్తుల కష్టం.. అధికారుల మౌనం --గ్రామ చందాలతో కొనుగోలు చేసిన ఎకరం భూమికి బోర్డు వివాదం.. --ఉన్నతాధికారుల లేఖలకూ స్పందన కరువు.. -+8 నెలలుగా పరిష్కారానికి నోచుకోని సమస్య.. --సొంత పాఠశాలలోనే వివాదాన్ని చక్కదిద్దలేని ఎంఈఓ తీరుపై గ్రామస్తుల అసహనం కివీస్‌తో నాలుగో వన్డేలో టీమిండియా చిత్తు.. 244 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసిన భారత్ మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్

ప్రత్యామ్నయ పంటల సాగును ప్రోత్సహించాలి

Select Suryaa Now
ప్రత్యామ్నయ పంటల సాగును ప్రోత్సహించాలి

సూర్య జగిత్యాల ప్రతినిధి:రబీ 2026-27 సీజన్‌ లో ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేని నేపథ్యంలో వరి సాగును నివారించి,పండ్లు, కూరగాయలు,  ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు.ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ సాగు, సూక్ష్మ సేద్యం పై రైతులకు అవగాహన కల్పించాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్లకు ఆదేశించారు.శుక్రవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక, విద్యాశాఖ, భూసేకరణ, వీధి కుక్కల నియంత్రణ,  పనుల పురోగతిపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. పీఎం శ్రీ పథకాల కింద మంజూరైన నిధులను కూడా పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.11 వేల కోట్ల వ్యయంతో 87 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఇప్పటివరకు రూ.625 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ పనులను కలెక్టర్లు క్రమం తప్పకుండా సమీక్షిస్తూ వేగవంతం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రూ.1,108 కోట్లతో మంజూరైన 115 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ప్రసునాంబ, రెవెన్యూ డివిజనల్ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.