BREAKING
రెబల్ స్టార్ ప్రభాస్ 'ఫౌజీ' మూవీ నుండి పవర్‌ఫుల్ 'ఫైల్ నంబర్ 25' గ్లింప్స్ విడుదల 21 మంది పాత నేరస్థులకు బైండోవర్ తాగునీరు ,సాగునీటికి తప్పని తిప్పలు! పరిశీలనలో అంతా సక్రమమే *వైభవంగా సంగారెడ్డి సాయిబాబా ఆలయ రజతోత్సవాలు* అనధికారిక మద్యం దుకాణదారులపై బైండోవర్ కేసులు సమయపాలన పాటించని గ్రామ కార్యదర్శులు ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు - జిల్లా కలెక్టర్ కె.హరిత బుచ్చిరెడ్డిపాళెం 12, 13 వార్డుల్లో ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే ఘనంగా గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం నవ్వుల రానిచ్చేలా 'ఓస్కార్ మిస్సింగ్' సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల నిర్మాణాలకు ఆమోదిత ఇసుకను మాత్రమే వాడాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. భూమిలో నుండి వచ్చిన నీటిని. భూమిలోకి పంపిద్దాం పట్టణంలో ముమ్మరంగా రాత్రి పహారా, ఆకస్మిక తనిఖీలు శ్రీకృష్ణ సదర్ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి: డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్

ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో వ్యవసాయ క్షేత్ర చెరువు నిర్మాణం చేపట్టాలి - జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Select Suryaa Now
ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో వ్యవసాయ క్షేత్ర చెరువు నిర్మాణం చేపట్టాలి -  జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

సూర్య- బిక్కనూర్ : ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో వ్యవసాయ క్షేత్ర చెరువు నిర్మాణం చేపట్టాలని,జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శనివారం మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో వి బి జి, రాంజీ పథకం కింద కొనసాగుతున్న వ్యక్తిగత వ్యవసాయ క్షేత్ర చెరువు నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో వ్యవసాయ క్షేత్ర చెరువు నిర్మించుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా భూగర్భ జలాల పెరుగుదలకు, పంటలకు అవసరమైన సాగునీటి లభ్యతకు వ్యవసాయ క్షేత్ర చెరువులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. నీటి లభ్యతను పెంచుకోవడంతో పాటు పంటల దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామానికి చెందిన రైతు సింగిని భిక్షపతి తనకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో వ్యవసాయ క్షేత్ర చెరువు నిర్మాణం చేపట్టడాన్ని కలెక్టర్ అభినందించారు. ఇతర రైతులు కూడా ఈ విధంగా ముందుకు రావాలని సూచించారు.అనంతరం వ్యవసాయ క్షేత్ర చెరువు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్న కూలీలతో కలెక్టర్ మాట్లాడి, పనుల పురోగతి, కల్పించిన పని దినాలు, పనులు ప్రారంభించిన తేదీ, కూలీల వేతనాల చెల్లింపుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువు పరిమాణం, లోతు తదితర వివరాలను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించడంతో పాటు నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. గ్రామ సర్పంచ్‌తో పాటు గ్రామంలోని ఇతర రైతులు కూడా తమ వ్యవసాయ భూముల్లో వ్యవసాయ క్షేత్ర చెరువుల నిర్మాణానికి ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ దామోదర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, ఎంపీడీఓ సవిత రెడ్డి, ఏడీఏ అపర్ణ, గ్రామ సర్పంచ్ సాయాగౌడ్, సహకార సంఘ చైర్మన్ బాలగోని రాజాగౌడ్, మండల అధికారులు, ఉపసర్పంచ్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.