ప్రమాదంలో గాయపడ్డ కార్మికుడికి అండగా బిజెపి నేత రూ.5 వేల సహాయం.. బాధితుడిని ఆసుపత్రికి తరలించిన కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి
జిన్నారం;బొల్లారం డివిజన్ వినాయక్ నగర్ కాలనీలో నివసిస్తున్న బీహార్‌కు చెందిన కార్మికుడు అజయ్ రాయ్ ప్రమాదంలో గాయపడటంతో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కే.జె.ఆర్. ఆనంద్ కృష్ణా రెడ్డి స్పందించారు. బాధితుడి ఇంటికి వెళ్లి పరిస్థితిని తెలుసుకొని, 108 అంబులెన్స్‌ను పిలిపించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. వైద్య ఖర్చులు, అత్యవసర అవసరాల కోసం రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. రోజువారీ కూలీ పనులతో కుటుంబాన్ని పోషించే అజయ్ రాయ్ గాయపడటంతో భార్య మునియా దేవి, వారి నలుగురు పిల్లలతో కూడిన కుటుంబం ఇబ్బందుల్లో పడింది. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచినందుకు కాలనీవాసులు ఆనంద్ కృష్ణా రెడ్డిని అభినందించారు.