BREAKING
అసత్యంపై ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది: ద్వారక దసరా వేడుకల్లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం! భారత విమానయాన రంగంలో రికార్డుల ప్రస్థానం: 2047 నాటికి 130 కోట్ల ప్రయాణికులే లక్ష్యం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి! సంపద, విజ్ఞానం, శక్తి కలబోసిన భారత్‌గా తీర్చిదిద్దడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం: తజికిస్తాన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ! కొద్ది వారాల్లోనే భారత్-అమెరికా చారిత్రక వాణిజ్య ఒప్పందం: యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన ప్రకటన! ఉగ్రవాదంపై మా భాగస్వామ్య దేశాలు జీరో టాలరెన్స్ చూపించాలి: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ.. తహవ్వుర్ రాణా అప్పగింతపై హర్షం! 'ఉడాన్' పథకానికి పదేళ్లు: దేశవ్యాప్తంగా 1.72 కోట్ల మందికి విమాన ప్రయాణం.. 687 రూట్లతో సామాన్యుడి సొంతమైన ఆకాశం! భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందం అమలు.. ఇరుదేశాల హర్షం! హరిహర క్షేత్రంలో ఘనంగా శమి పూజలు 2029 డిసెంబర్ 31 నాటికి పంజాబ్‌ను ‘నశా ముక్త్’గా మారుస్తాం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన డెడ్‌లైన్! ఎన్నికలు రాగానే పంజాబ్ గుర్తొచ్చిందా?: అమిత్ షాపై భగవంత్ మాన్ ధ్వజం! కాలనేమి కూడా రాముడి నామాన్ని జపించేవాడు: అయోధ్యపై విపక్షాల దుష్ప్రచారంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు! మహారాష్ట్రలో ప్రభుత్వం మారాల్సిందే: దసరా ర్యాలీలో బీజేపీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ధ్వజం! అమెరికాలో 3 లక్షల వీసాల రద్దు.. నేరస్థులపై ఉక్కుపాదం! పాకిస్తాన్, సౌదీ అరేబియాతో చారిత్రక 'మక్కా రక్షణ ఒప్పందం': ధ్రువీకరణ కోసం పార్లమెంటుకు పంపిన టర్కీ ప్రభుత్వం! ఇంధన సంక్షోభంపై మాక్రాన్ వ్యూహం: గల్ఫ్ దేశాల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు

పూల జాతరతో పటాన్ చెరు పులకింత.. అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరు గంటలపాటు ఉత్సవాలు జానపద గీతాలు, రచ్చ రవి బృందం ప్రదర్శనలతో హోరెత్తిన వేడుకలు ఉత్తమ బతుకమ్మల విజేతలకు రూ.50 వేల నగదు బహుమతులు,పట్టు చీరలు

Select Suryaa Now
పూల జాతరతో పటాన్ చెరు పులకింత.. అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరు గంటలపాటు ఉత్సవాలు జానపద గీతాలు, రచ్చ రవి బృందం ప్రదర్శనలతో హోరెత్తిన వేడుకలు ఉత్తమ బతుకమ్మల విజేతలకు రూ.50 వేల నగదు బహుమతులు,పట్టు చీరలు

పటాన్ చెరు;తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ సంబరాలు పటాన్ చెరు లో అంబరాన్నంటాయి.పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే తెలంగాణ ఆడపడుచుల పండుగకు సాకి చెరువు కట్ట వేదికగా నిలిచింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన వేడుకలకు మహిళలు వేలాదిగా తరలివచ్చారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు, జానపద గీతాలు, సంప్రదాయ నృత్యాలతో సాకి చెరువు కట్ట పండుగ శోభను సంతరించుకుంది.సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన సంబరాలు రాత్రి 11 గంటల వరకు ఆరు గంటలపాటు ఉత్సాహంగా కొనసాగాయి. వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై బతుకమ్మలను తీసుకొచ్చారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు లయబద్ధంగా ఆడిపాడుతూ పూల పండుగలో సందడి చేశారు. జానపద గాయకుల పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు మరింత కళను తీసుకొచ్చాయి.ప్రకృతిని ఆరాధించే అపురూప పండుగ బతుకమ్మ ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధానికి, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గొప్పతనానికి ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. బతుకమ్మ వేడుకలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.పటాన్ చెరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, ఆదరణతో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా పటాన్చెరు పట్టణ ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలను జీవితాంతం మరువలేనని తెలిపారు. గత 15 ఏళ్లుగా బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తూ ప్రజల సంతోషాల్లో భాగస్వాములవుతున్నామని, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.రచ్చ రవి బృందం ప్రదర్శనలతో ప్రత్యేక ఆకర్షణ ప్రముఖ నటుడు, హాస్య కళాకారుడు రచ్చ రవి నేతృత్వంలోని బృందం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వినోదభరిత కార్యక్రమాలతో కళాకారులు ప్రేక్షకులను అలరించారు. కాజిపల్లి భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ పాటలు, జానపద సంగీత కార్యక్రమాలు మహిళలను మరింత ఉత్సాహపరిచాయి. పాటలకు అనుగుణంగా మహిళలు ఆడిపాడడంతో సాకి చెరువు కట్ట పరిసరాలు సందడిగా మారాయి.విజేతలకు రూ.50 వేల నగదు బహుమతులు సంప్రదాయబద్ధంగా, సృజనాత్మకంగా బతుకమ్మలను అలంకరించి తీసుకొచ్చిన మహిళలను ప్రోత్సహించేందుకు ఉత్తమ బతుకమ్మల పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రథమ బహుమతిగా రూ.20 వేలు, పట్టు చీర, ద్వితీయ బహుమతిగా రూ.15 వేలు, పట్టు చీర, తృతీయ బహుమతిగా రూ.10 వేలు, పట్టు చీర అందజేశారు. మరో 15 మంది మహిళలకు కన్సోలేషన్ బహుమతులతోపాటు పట్టు చీరలను ప్రదానం చేశారు. బహుమతులు అందుకున్న మహిళల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వేడుకల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, ఆయన కుమార్తె, కోడలు, మనుమరాళ్లు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. కుటుంబ సభ్యులు సంప్రదాయ వేడుకల్లో పాల్గొనడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. పూల పరిమళాలు, జానపద గీతాలు, మహిళల ఆటపాటలతో సాకి చెరువు కట్ట పండుగ వాతావరణాన్ని తలపించింది.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సద్దుల బతుకమ్మ వేడుకలు పటాన్ చెరు లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పాయి.