BREAKING
బెల్జియం ట్యాక్స్ ఏజెన్సీపై సైబర్ దాడి కలకలం.. ఆన్‌లైన్ పోర్టల్ తాత్కాలిక నిలిపివేత ఆర్నబ్ తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి....ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్... మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కసిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీలను అభినందిస్తున్న ..ఎంపీ శబరి..! ఎయిర్‌ కెనడా, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానయాన ఒప్పందం ప్రధాని మోదీపై ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ దళిత మోర్చా నేత నింగ్యారి యాదగిరి* సైబర్ నేరాల పట్ల యువత అవగాహన కలిగి ఉండాలి* 2030 లక్ష్య సాధనకు భారత్ బృహత్తర ప్రణాళిక ఏఐ ట్రైనింగ్ వర్కర్లపై చట్టవిరుద్ధ నిఘా ఆరోపణలను ఖండించిన స్కేల్ ఏఐ రక్తదానం గొప్ప సామాజిక సేవకు ప్రతీక పెరుగుతున్న వాతావరణ ముప్పుపై భీమా రంగం హెచ్చరిక శివన్నగూడెం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి.. ఉమ్మడి నల్లగొండ రైతులకు నీటి భరోసా కల్పించాలి! చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అమెరికా వ్యాపార దిగ్గజాల కీలక డిమాండ్..రాజకీయ స్థిరత్వం, సుస్థిర ఆర్థిక విధానాలే ప్రాధాన్యత తుఫాన్ వర్షాలకు పెద్దూరులో కూలిన ఇంటి స్లాబ్

పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన

Select Suryaa Now
పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన

నవాబుపేట సూర్య న్యూస్: జిల్లా న్యాయాధికారి ఆదేశాల మేరకు నవాబుపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)విద్యార్థులకు పోక్సో చట్టంపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ మహమ్మద్ మునవర్ హుస్సేన్ విద్యార్థులకు పోక్సో చట్టం,బాలల రక్షణ,వారి హక్కుల గురించి వివరించారు.బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.ప్రతి విద్యార్థి తన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని,ఏవైనా వేధింపులు ఎదురైతే భయపడకుండా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై నరేందర్,కేజీబీవీ ప్రత్యేక అధికారి మాధవి,పాఠశాల సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.