BREAKING
కృష్ణానదిలో వైభవంగా దుర్గమ్మ తెప్పోత్సవం: హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చిన దుర్గామల్లేశ్వరులు 34వ డివిజన్‌లో సరిపూటి రమణ ప్రచార హోరు.. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థన.. బైరాగి గూడా లో ఘనంగా దసరా వేడుకలు దుర్గామాత సేవలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి జానంపేటలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రేగా ఇంటిపై టి.డి.పి గుండాలదాడి నామినేషన్ తిరస్కరించడంపై పోరెడ్డిని కలిసి రెడ్యం సీఎం నివాసంలో ఆయుధ పూజ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను పరిశీలించిన అసిస్టెంట్ ఎన్నికల అధికారి, కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ కోల్‌కతా తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చెక్కులు అందజేసిన సీఎం సువేందు అధికారి సీఎం ఇంట్లో ఆయుధ పూజ ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరంగా ఘజియాబాద్: వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదికలో భారత్ హవా! ఘనంగా ఆయుధ పూజ ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో భారత నూతన హైకమిషన్ భవన నిర్మాణానికి ఘనంగా భూమి పూజ! MVSR కళాశాల ప్రమాదం: ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు చెందిన ముగ్గురు అరెస్ట్ పిడుగుపాటుకు గురైనా ప్రియుడికి రెండుసార్లు సీపీఆర్ చేసి బతికించిన యువతి: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే పెళ్లి ప్రతిపాదన!

పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్న పులిమామిడి రాజు

Select Suryaa Now
పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్న పులిమామిడి రాజు

సదాశివపేట ; తెలంగాణ వీరయోధుడు, ప్రజల కోసం పోరాడిన ధీరుడు పండుగ సాయన్న జయంతి వేడుకలను ఈ నెల 22వ తేదీన హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ఆడిటోరియం నందు ఘనంగా నిర్వహించబడును. కావున ముఖ్య అతిథులు, అతిథులు, నాయకులు, అన్ని జిల్లాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ముదిరాజ్ సంఘం నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ సాయన్న జయంతి వేడుకల్లో పాల్గొనాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా ముదిరాజ్ బంధువులు ఘనంగా నిర్వహించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు పిలుపునిచ్చారు. సదాశివపేట పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ఉదయం 12:00 గంటలకు ఆయన పండగ సాయన్న జయంతి గోడపత్రికను, పోస్టర్ ను నారాయణ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ చరిత్రలో పండుగ సాయన్నకు ప్రత్యేక స్థానం ఉందని, ఆయన పోరాట స్ఫూర్తి, ధైర్యసాహసాలు, ప్రజల పట్ల చూపిన అంకితభావం నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన పండుగ సాయన్న జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు సిద్ధమవడం సంతోషకరమని పులిమామిడి రాజు అన్నారు. పండుగ సాయన్న జీవిత చరిత్రను, ఆయన చేసిన పోరాటాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఆయన ఆశయాలు, సేవాభావం సమాజానికి స్ఫూర్తినిచ్చేలా జయంతి వేడుకలను నిర్వహించాలని సూచించారు. ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్న జయంతి కార్యక్రమాల్లో ముదిరాజ్ బంధువులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. పండుగ సాయన్నకు తగిన గుర్తింపు లభించేలా, ఆయన చరిత్ర ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నారాయణ, చీలం రమేష్, నల్ల సాయి, రాగం అనిల్, తదితరులు పాల్గొన్నారు.