BREAKING
యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ 'భామ సుందరలో' కొత్త జానపద పాట! 29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ......

ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. :

Select Suryaa Now
ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. :
సూర్య నిర్మల్ ప్రతినిధి. :ఫార్మర్ రిజిస్ట్రీ, డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియలు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వ్యవసాయ సంబంధిత అంశాలపై అధికారులతో మంగళవారం  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మండలాల వారిగా పూర్తి చేయాల్సిన ఫార్మర్ రిజిస్ట్రీ, డిజిటల్ క్రాప్ సర్వే, ఇప్పటి వరకు పూర్తయిన ప్రక్రియ, ఇంకనూ పూర్తి చేయాల్సిన ప్రక్రియ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏకకాలంలోనే డిజిటల్ క్రాప్ సర్వే, ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియలను పూర్తి చేయాలని సూచించారు. వాలంటీర్లు అందరూ డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియ వేగవంతంగా పూర్తిచేసేలా అధికారులు పర్యవేక్షణ ఉంచాలని పేర్కొన్నారు. పంటల కోతల సమయానికి మునుపే డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియ మొత్తాన్ని పూర్తిచేయాలని ఆదేశించారు.
 రాబోయే రబీ పంట కాలంలో రైతులు పంట మార్పిడి విధానాలు విస్తృతంగా పాటించేలా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి రైతుతో మాట్లాడి పంట మార్పిడి విధానాల ఆవశ్యకతను వివరించాలని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి సుజాత, మండల వ్యవసాయ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.