పెద్దమ్మ ఆలయంలో కుంకుమార్చన పూజలు
రామాయంపేట;నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో శనివారం కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ప్రతి సంవత్సరం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి శరన్నవరాత్రి ఉత్సవాలు జరిపిస్తామన్నారు. దీనిలో భాగంగానే గ్రామ మహిళలచే కుంకుమార్చన కార్యక్రమం చేపట్టాలని తెలిపారు అమ్మవారు అనుగ్రహం గ్రామ ప్రజలపై ఉండాలన్నారు.