BREAKING
ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ...... నగరంలో కూటమి ప్రచార బేరి ఓటమి భయంతోనే విధ్వంస రాజకీయాలు -రూ.4.75 కోట్ల రోడ్డును అర్ధరాత్రి ధ్వంసం - ఇది అభివృద్ధిపై దాడి కాదా? -పులివెందుల పులి తోక కట్-నీ ఇలాకా కూడా కూటమి వశమే జగన్ టాబ్లెట్లు వేసుకోకుండా ఎవరిని సస్పెండ్ చేస్తాడో? వైసీపీపై కిరణ్ రాయల్ సంచలన ధ్వజం

పాడైపోయిన మాంసాన్ని సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు

Select Suryaa Now
పాడైపోయిన మాంసాన్ని సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు

జనగామ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్, జనగామ మున్సిపాలిటీ పరిధిలో ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా అధికారులు తనిఖీలు నిర్వహించి, పాడైపోయిన మాంసాన్ని గుర్తించి సీజ్ చేశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉన్న మాంసాన్ని విక్రయించకుండా తగిన చర్యలు చేపట్టారు. సీజ్ చేసిన పాడైపోయిన మాంసాన్ని నిబంధనల ప్రకారం సంబంధిత అధికారుల పర్యవేక్షణలో గుంతలో పాతిపెట్టడం జరిగింది. ప్రజలకు కలుషితమైన, నాణ్యత లేని మాంసం విక్రయించకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు మున్సిపాలిటీ చర్యలు చేపట్టింది.ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు ప్రజలకు సూచించేది ఏమనగా మాంసం కొనుగోలు చేసే సమయంలో దాని తాజాదనం, నాణ్యతను పరిశీలించాలని,  అపరిశుభ్ర వాతావరణంలో మాంసం విక్రయించే దుకాణాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. పాడైపోయిన మాంసం విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.మాంసం విక్రయదారులు తప్పనిసరిగా పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తూ, ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. 

రిపోర్టర్, నవీన్ చారి, జనగామ, జనగామ జిల్లా