BREAKING
యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ 'భామ సుందరలో' కొత్త జానపద పాట! 29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ......

నిజాయితీగూడెంలో నింగినంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
నిజాయితీగూడెంలో నింగినంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు

సూర్య - మానకొండూర్: మండలంలోని నిజాయితీగూడెం గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి. శ్రీ దుర్గ మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో గ్రామ మహిళలు, భవాని మాలధారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాల్లో మునిగితేలారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను గ్రామ చౌరస్తాలో ఉంచి, మహిళలు పూల చుట్టూ తిరుగుతూ లయబద్ధంగా పాటలు పాడుతూ కోలాటాలు ఆడారు. ఆ తర్వాత ఊరేగింపుగా వెళ్లి స్థానిక చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అనంతరం ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు శామంతుల శ్రీనివాస్, ఆడెపు రమేష్, గడ్డి కుమార్, దొంగల శ్రీధర్, కాల్వ అజయ్, గడ్డి శ్రీనివాస్, పోచంపల్లి శ్రీనివాస్, గడ్డి రమేష్‌లతో పాటు కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు విశేషంగా పాల్గొన్నారు. వేడుకలు విజయవంతం కావడంతో గ్రామంలో పండుగ శోభ సంతరించుకుంది.