BREAKING
ఇంధన సంక్షోభంపై మాక్రాన్ వ్యూహం: గల్ఫ్ దేశాల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు జామ్‌నగర్ రిఫైనరీకి యూఎస్ విదేశాంగ మంత్రి: ఇంధన వ్యూహమే ప్రధాన లక్ష్యం! సౌదీ అరేబియా రక్షణకు బ్రిటన్ కీలక నిర్ణయం: రాయల్ ఎయిర్‌ఫోర్స్ టైఫూన్ యుద్ధ విమానాల మోహరింపు! ఫ్రాన్స్ హింసాత్మక అల్లర్లు: మరిన్ని నగరాల్లో కర్ఫ్యూ విధింపుపై ప్రధాని ప్రకటన ఇరాన్ పాలకుల పాలనను అంతమొందించడమే మా లక్ష్యం: నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు.. భారత్-అమెరికా బంధం: వాణిజ్యం, భద్రతపై జైశంకర్ ఉన్నత స్థాయి భేటీ ఫారమ్ 173A అంటే ఏమిటి?: ప్రభుత్వ సెక్యూరిటీలపై పన్ను మినహాయింపుల కోసం సీబీడీటీ కొత్త నిబంధనలు! MSCI హెచ్చరికలతో కుప్పకూలిన ఇండోనేషియా స్టాక్ మార్కెట్.. 2031 నాటికి హార్ముజ్ జలసంధి ప్రాధాన్యత కనుమరుగు: హెచ్‌ఎస్‌బీసీ సీఈవో పండుగల వేళ ఈ-కామర్స్ జోరు: ఫ్లిప్‌కార్ట్ యాక్టివ్ యూజర్లలో సరికొత్త రికార్డు.. బోఫా (BofA) నివేదికలో కీలక వెల్లడి! పండుగల వేళ అమెజాన్ బంపర్ రిక్రూట్‌మెంట్: 3 లక్షల మందికి పైగా నియామకాలు.. ఫ్యాక్టరీ ప్రమాదం దర్యాప్తులో షెఫ్లర్ ఇండియా సీఈవో హర్ష కదమ్‌ను అదుపులోకి తీసుకున్న పూణే పోలీసులు! నేటి పంచాంగం 21 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –21 అక్టోబర్ 2026 అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి

నెలవారీ తనిఖీల్లో భాగంగా గోదాంలోని రికార్డులు, రిజిస్టర్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

Select Suryaa Now
నెలవారీ తనిఖీల్లో భాగంగా గోదాంలోని రికార్డులు, రిజిస్టర్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
సూర్య నిర్మల్ ప్రతినిధి :నిర్మల్ కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సోమవారం నెలవారీ తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాంలోని రికార్డులు, రిజిస్టర్లను తనిఖీ చేసి, సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక వ్యవస్థల సన్నద్ధతను సమీక్షించారు.ఈవీఎం గోదాం వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు నిరంతరం కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. పోలీసు సిబ్బంది సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన పరికరాలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, ఎలాంటి లోపాలకు తావులేకుండా చూడాలని సూచించారు.ఈ తనిఖీలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, డీపీఆర్వో ఇ. విష్ణువర్ధన్, తహసీల్దార్ రాజు, అధికారులు స్వాతి, పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.