BREAKING
విరాట్ కోహ్లి భారీ రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజం.. ఐఎల్‌టీ20 అరంగేట్రంలోనే అదుర్స్! సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రియాంష్ ఆర్య విధ్వంసం.. టీ20లో అత్యధిక వ్యక్తిగత స్కోరుతో భారత రికార్డు! అగ్రిగోల్డ్ బాధితుల నిరీక్షణకు తెర-ఈనెల 25 నుంచి బాండ్ల పరిశీలన-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ .శ్వేత అండాల అక్రమ సేకరణ కేసులో డాక్టర్ పద్మజకు షాక్‌ ప్రమాద భరితంగా గంగవరం రోడ్డు పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ రోజున స్థానిక సెలవు నాన్న కాదు.. ఆయనే నా ఫేవరెట్ క్రికెటర్.. విరాట్ కోహ్లిపై ఆర్యవీర్ సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు శ్రీ దత్త సాయి ఆలయంలో కార్తిక పౌర్ణమి వేడుకలు ఘనంగా సెంచూరియన్‌లో కగిసో రబాడా సరికొత్త చరిత్ర.. డేల్ స్టెయిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు! కళ్యాణదుర్గం పట్టణంలో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం. శివాలయంలో భక్తి పరవశం - కార్తీక పౌర్ణమి వేళ ఇస్గాం శివాలయానికి పోటెత్తిన భక్తులు గోపాలపూర్ లో వికసించిన అరుదైన బ్రహ్మ కమలం సూపర్‌మేన్‌లా డైవ్ చేసి కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన కుమార్ కుషాగ్ర.. యూఏఈ మ్యాచ్‌లో అద్భుతం! కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో యూఏఈ టాస్ గెలిచి బ్యాటింగ్.. హర్‌ప్రీత్ సెంచరీ, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం!

నల్గొండలో లీగల్ మెటరాలజీ శాఖ తనిఖీ... #. 13 కేసుల నమోదు.

Select Suryaa Now
నల్గొండలో లీగల్ మెటరాలజీ శాఖ తనిఖీ...                       #. 13 కేసుల నమోదు.


నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్...     నల్గొండ నగర పంచాయతీలో వివిధ కూరగాయల దుకాణాలు, ఇనుము/హార్డ్‌వేర్ దుకాణాలు శానిటరీ లలో జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి  శ్రీనివాసులు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి శ్రీనివాసులు  టెక్నికల్ అసిస్టెంట్ కె. వెంకటేశ్వర్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
తనిఖీల సందర్భంగా ఆయా వ్యాపార సంస్థలలో వినియోగిస్తున్న తూకాలు కొలతల పరికరాల ధృవీకరణ, స్టాంపింగ్ చెల్లుబాటు, తూకాలు మరియు కొలతల ఖచ్చితత్వం, అలాగే ప్యాకేజ్డ్ వస్తువులపై తప్పనిసరిగా ప్రకటించాల్సిన వివరాలు తదితర అంశాలను పరిశీలించారు.
అర్థమైందా తనకీలలో లీగల్ మెట్రాలజీ యాక్ట్, 2009 నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన వ్యాపార సంస్థలపై మొత్తం 13 కేసులు నమోదు చేయడం జరిగింది. సంబంధిత కేసుల్లో నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టబడతాయి.
వ్యాపారులు తూకాలు మరియు కొలతల పరికరాలను నిర్ణీత కాలవ్యవధిలో ధృవీకరించించుకొని, చెల్లుబాటు అయ్యే స్టాంపింగ్‌తో మాత్రమే వినియోగించాలని, అలాగే ప్యాకేజ్డ్ వస్తువుల విషయంలో చట్టపరంగా నిర్దేశించిన అన్ని వివరాలను తప్పనిసరిగా ప్రకటించాలని జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి సూచించారు.
వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు లీగల్ మెట్రాలజీ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.