నక్క గుట్ట తండాలో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచా స్వాధీనం
*నక్క గుట్ట తండాలో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచా స్వాధీనం*
సీఐ నందీశ్వర్ రెడ్డి
ఒకరు అరెస్టు,
కేసు నమోదు,
యాచారం మండల పరిధిలో నక్కగుట్ట తండాలో అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన భారీ బాణసంచా నీ యాచారం పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో నక్కగుట్ట తండా గ్రామ ప్రధాన రహదారి పై పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, నక్కగుట్ట తండాలోని ఒక ఇంట్లో ఎలాంటి భద్రత ప్రమాణాలు పాటించకుండా భారీగా బాణసంచా నిల్వ ఉంచినట్లు నమ్మదగిన సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి, సదర్ గృహంపై అకస్మాత్తు గా దాడి నిర్వహించారు. ఈ తన్ఖీలో నిబంధనలకు విరుద్ధంగా నిలువ ఉంచిన వివిధ రకాల లక్ష్మి టైం బాంబులు, చట్టపటాలు (200 పైగా బాండిల్స్) 1000, 2000, 5000, పేలుడు గొలుసులు హైడ్రోబాములు, కింగ్ కాంగ్ బాములు, డీలాక్స్ బాంబులు, రకరకాల కాకర పువ్వత్తులు భూ చక్రాలు విష్ణు చక్రాలు 12, 30, 60, 100, 120 షాట్ల ఫ్యాన్సీ స్కై, షాట్లు( 81 రకాల) భారీ సంచాను సామాగ్రి బయటపడిందన్నారు, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకొని నక్కగుట్ట గ్రామానికి చెందిన విస్లావత్ పురుషోత్తం 29 వ్యాపారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ప్రజల ప్రాణాలకు ఆస్తులకు నష్టం వాటిల్లే నిర్లక్ష్య వైఖరిగా బానసంచ నిలువ చేసినందుకు సదరు వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని యాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.