BREAKING
ఐడి కార్డులు పంపిణీ చేసిన వైసిపి మండల అధ్యక్షులు కొత్త గూడ ఘనంగా విజయదశమి వేడుకలు స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు , కొండారెడ్డిపల్లిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు.. జెమ్మి చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు కల్వకుర్తి దసరా వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి.. రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఘనంగా దేవీ నవరాత్రులు ఈటల రాజేందర్ నివాసంలో ఘనంగా విజయదశమి వేడుకలు వైయస్సార్సీపి జడ్పీటీసీ అభ్యర్థిగా బోల్లెద్దు ప్రతాప్ కుమార్ -ప్రకటించిన వరికూటి భూమా నంద ఆశ్రమంలో వైభవంగా దుర్గమ్మ వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. వికసిత్‌ భారత్ లక్ష్య సాధనలో శ్రీరాముడి స్ఫూర్తిని పొందాలి గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన- సబ్ రిజిస్టర్ కార్యాలయానికి శంకుస్థాపన, స్టేడియం, ఈనెల 26న చలో హైదరాబాద్ కు వేలాదిగా తరలి రండి షాద్‌నగర్ 18వ వార్డులో ఘనంగా జమ్మి పూజ, రావణ దహనం.... స్థానిక ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు వైభవంగా బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామం లో శమి పూజలు...దసరా వేడుకలు...

నకిలీ భూ పత్రాలతో స్థలం విక్రయానికి యత్నం.. ఇద్దరు అరెస్ట్‌

Select Suryaa Now
నకిలీ భూ పత్రాలతో స్థలం విక్రయానికి యత్నం.. ఇద్దరు అరెస్ట్‌

కీసర, (మేజర్‌ న్యూస్‌): నకిలీ భూ పత్రాలు సృష్టించి, వాటి ఆధారంగా స్థలాన్ని అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన కేసులో ఇద్దరు నిందితులను కీసర పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి నకిలీ పత్రాలు, నోటరీ స్టాంప్‌ పేపర్లు, మొబైల్‌ ఫోన్లు, ఇతర సంబంధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను కీసర పోలీస్‌ స్టేషన్‌ సీఐ ఎన్. ఎలక్షన్‌ రెడ్డి శనివారం వెల్లడించారు.కీసర సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న డి. సోనీ, డాక్యుమెంట్‌ నంబర్‌ 720/1982కు సంబంధించిన పత్రాలను పరిశీలించగా అసలు రిజిస్ట్రేషన్‌ రికార్డుల్లోని వివరాలకు, సమర్పించిన పత్రాల్లోని వివరాలకు పొంతన లేదని గుర్తించారు. అసలు డాక్యుమెంట్‌ నాగారం గ్రామంలోని మరో ఆస్తికి సంబంధించిందని, అందులోని వివరాలను ఉపయోగించి రాంపల్లి గ్రామంలోని సర్వే నంబర్‌ 402లో ఉన్న ప్లాట్‌ నంబర్‌ 34కు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో భాగంగా అక్టోబర్‌ 17న మహమ్మద్‌ ఖదీర్‌ (ఎ2), రెగు రాజు (ఎ4)లను అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి కేసుకు సంబంధించిన పత్రాలు, నోటరీ స్టాంప్‌ పేపర్లు, మొబైల్‌ ఫోన్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్రాల తయారీ, వినియోగం, వాటి ఆధారంగా స్థలాన్ని విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని సీఐ తెలిపారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇతర నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.స్థిరాస్తులు కొనుగోలు చేసే ముందు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ రికార్డులు, లింక్‌ డాక్యుమెంట్లు, యాజమాన్య హక్కులు, ఇతర సంబంధిత పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సీఐ ఎన్. ఎలక్షన్‌ రెడ్డి ప్రజలకు సూచించారు. నకిలీ పత్రాలు, భూ మోసాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు.