ముత్తంగిలో పారిశుధ్య కార్మికులకు దసరా కానుకలు -200 మందికి పైగా కార్మికులకు చీరలు, గొడుగులు,నగదు పంపిణీ చేసిన -కాంగ్రెస్ సీనియర్ నాయకులు శాపురం నర్సింహారెడ్డి
పటాన్‌చెరు;దసరా పండుగను పురస్కరించుకుని ముత్తంగి డివిజన్ 265 పరిధిలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు శాపురం నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు దసరా కానుకలు పంపిణీ చేశారు.200 మందికి పైగా పారిశుధ్య కార్మికులు, ఇతరులకు చీరలు,గొడుగులు, నగదు అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శాపురం నర్సింహారెడ్డి మాట్లాడుతూ, దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నారు.సమాజంలో పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో విలువైనవని,వారు నిరంతరం శ్రమిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. వారి సేవలను గుర్తిస్తూ పండుగ వేళ కానుకలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు.ముత్తంగి డివిజన్ ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.