BREAKING
అసత్యంపై ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది: ద్వారక దసరా వేడుకల్లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం! భారత విమానయాన రంగంలో రికార్డుల ప్రస్థానం: 2047 నాటికి 130 కోట్ల ప్రయాణికులే లక్ష్యం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి! సంపద, విజ్ఞానం, శక్తి కలబోసిన భారత్‌గా తీర్చిదిద్దడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం: తజికిస్తాన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ! కొద్ది వారాల్లోనే భారత్-అమెరికా చారిత్రక వాణిజ్య ఒప్పందం: యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన ప్రకటన! ఉగ్రవాదంపై మా భాగస్వామ్య దేశాలు జీరో టాలరెన్స్ చూపించాలి: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ.. తహవ్వుర్ రాణా అప్పగింతపై హర్షం! 'ఉడాన్' పథకానికి పదేళ్లు: దేశవ్యాప్తంగా 1.72 కోట్ల మందికి విమాన ప్రయాణం.. 687 రూట్లతో సామాన్యుడి సొంతమైన ఆకాశం! భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందం అమలు.. ఇరుదేశాల హర్షం! హరిహర క్షేత్రంలో ఘనంగా శమి పూజలు 2029 డిసెంబర్ 31 నాటికి పంజాబ్‌ను ‘నశా ముక్త్’గా మారుస్తాం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన డెడ్‌లైన్! ఎన్నికలు రాగానే పంజాబ్ గుర్తొచ్చిందా?: అమిత్ షాపై భగవంత్ మాన్ ధ్వజం! కాలనేమి కూడా రాముడి నామాన్ని జపించేవాడు: అయోధ్యపై విపక్షాల దుష్ప్రచారంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు! మహారాష్ట్రలో ప్రభుత్వం మారాల్సిందే: దసరా ర్యాలీలో బీజేపీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ధ్వజం! అమెరికాలో 3 లక్షల వీసాల రద్దు.. నేరస్థులపై ఉక్కుపాదం! పాకిస్తాన్, సౌదీ అరేబియాతో చారిత్రక 'మక్కా రక్షణ ఒప్పందం': ధ్రువీకరణ కోసం పార్లమెంటుకు పంపిన టర్కీ ప్రభుత్వం! ఇంధన సంక్షోభంపై మాక్రాన్ వ్యూహం: గల్ఫ్ దేశాల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు

మూడవ రోజు కలెక్టర్ కార్యాలయం ముందు మోకాళ్లపై నిరసన

Select Suryaa Now
మూడవ రోజు కలెక్టర్ కార్యాలయం ముందు మోకాళ్లపై నిరసన

మూడవరోజు కలెక్టర్ కార్యాలయం ముందు మోకాళ్లపై నిరసన  

మూడవ విడత ఇందిరమ్మ ఇండ్ల స్థలాలను,ఆస్థలాల్లో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివాసం ఉంటున్న 72 మందికి పట్టాలు ఇవ్వాలని.   

జనగామ జిల్లా. సూర్య ప్రతినిధి సెప్టెంబర్ 30 మేజర్ న్యూస్ ):-

జనగామ పట్టణంలో 2012 -13 సంవత్సరంలో ఇల్లు లేని పేదలను గుర్తించి 1144 మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి మౌలిక వసతులు గృహ రుణాలు ఇవ్వకుండా విస్మరించిన కారణంగా పేదలు ఇల్లు కట్టుకోలేకపోయారని ఆ స్థలాల్లో వారు శక్తి మేరకు నిర్మించుకున్న ఇండ్లకు ఇంటి నెంబర్లు అలాగే డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం స్థలం ఇచ్చిన ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్న 72 మంది పేదలకు వారి ఇండ్లను వారికే ఇవ్వాలని  మోకు కనకా రెడ్డి  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రోజున సిపిఎం జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు మూడవరోజు  మోకాళ్లపై నిరసన తెలిపి ఈ సందర్భంగా ఈ ధర్నాకు సిపిఎం పట్టణ జనగామ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా మోకు కనకా రెడ్డి పాల్గొని మాట్లాడుతూ. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారుల స్థలాలను గుంజుకొని డబల్ బెడ్ రూములు కట్టాలని నాటి ప్రభుత్వం పాలకులు బల ప్రయోగానికి పూనుకుంటే పేదలు కోర్టుకు వెళ్లి పేదల నిర్మించుకున్న ఇండ్ల స్థలాలను ఇండ్లను బలవంతంగా తీసుకోవద్దని చట్ట ప్రకారం నడుచుకోవాలని కోర్టు ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు. మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులు కలెక్టర్ కి మెమోరాండం ఇద్దామని పోతే టైం ఇవ్వలేదు కాబట్టి 1 ఇప్పటికైనా మూడో విడత లబ్ధిదారులతో మిమ్మలను తీసుకోకపోతే రేపటినుండి జనగామ జిల్లా వ్యాప్తంగా దశల 1వారి ఉద్యమాన్ని చేపడతామని వారు అన్నారు తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని పేద ప్రజలకు న్యాయం చేయాలని అన్నారు  పేద ప్రజ1ల పట్ల చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఇళ్లన్నీ పూర్తి చేసి వారికి వీరికి అందరికీ పట్టాలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి ¹చేయాలని అన్నారు  2019 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ ఆర్డిఓ తహసిల్దార్ పేదల వద్దకు వచ్చి వారితో మాట్లాడి ఇండ్లు లేని వారికి స్థలాలు ఇస్తామని చెప్పి లేఅవుట్వేసి ఇచ్చారని అలాగే ఆర్థిక స్తోమత లేక ఇల్లు కట్టుకోలేని వారికి 72 మందికి డబల్ బెడ్ రూములు ఇస్తూ 2023 జూలై మాసంలో ఆనాటి తహసిల్దార్ డిప్యూటీ తాసిల్దారులు జిల్లా కలెక్టర్ ఆదేశంతో డ్రా తీసి వారికి ఇండ్లకి కేటాయించారు. రెండు మూడు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ప్రజలు అక్కడ వారి శక్తి మేరకు ఇల్లు కట్టుకున్నారని ఈఆ ఇండ్లకు ఇంటి నెంబర్లు వేసి కనీస సౌకర్యాలు కరెంటు మంచినీరు కల్పించాలని పేదలు ఎనిమిది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం దారుణం అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతా వీరికి ఇందిరమ్మ ఇండ్ల రుణాలు మంజూరు చేయకుండా పక్కా గృహాలు కట్టించకుండా పేదలను ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. గతంలో డ్రా తీసి వారికి ఇల్లు కేటాయించిన వారు అధికారులు కాదా వాళ్ళు అనధికారులు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్ ఆన్లైన్లో డబుల్ బెడ్ రూమ్ ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ డ్రా చేసి పట్టాలు ఉన్న వారిని విస్మరించడం  సరైన కాదన్నారు. ఇప్పటికైనా న్యాయబద్ధంగా అర్హులైన పట్టాలు కలిగి ఉన్న డబుల్ బెడ్ రూములలో నివాసం ఉంటున్న పేదలకే డబుల్ బెడ్ రూమ్ పట్టాలు ఇవ్వాలని అలాగే ఇందిరమ్మ ఇళ్లలో నివాసం ఉంటున్న ఇళ్లకు జనగామ మున్సిపల్ ద్వారానే ఇంటి నెంబర్లు వేసి మౌలిక వసతులైన కరెంటు మంచినీరు సిసి రోడ్డు వంటి సౌకర్యాలు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.   ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు  బూడిది గోపి సుంచు విజేందర్ ఎండి అజారుద్దీన్   మూడో వార్డు కౌన్సిలర్ బూడిది జ్యోతి  మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారుల అధ్యక్షులు కళ్యాణం లింగం పట్టణ కమిటీ సభ్యులు పల్లెర్ల లలిత మున్సిపల్ జయ ఎండి గౌసియా కచ గళ్ళ వెంకటేష్ మాదాసి సుధాకర్ సిలివేరు ఉపేందర్ పద్మ అందాలు కమల నాజియా రేణుక కవిత శశిరేఖ సంతోష మల్లమ్మ సౌందర్య యాదమ్మ లక్ష్మి అమ్ములు తదితరులు తదితరులు పాల్గొన్నారు..*