telangana
మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
సూర్య రెంజల్ : మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాల & కళాశాల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలంటూ మధ్యాహ్న భోజన సమయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రిన్సిపల్ పురుషోత్తం తెలిపారు. శుక్రవారం తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాల వద్ద కొన్ని సంవత్సరాల నుండి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్ర కార్డులను పట్టుకొని నిరసనను వ్యక్తం చేశారు. ఆదర్శ పాఠశాల జేఏసీ పిలుపుమేరకు ఐదు రోజులు నిరసన కార్యక్రమాలను చేపడుతూ ప్రజాప్రతినిధులకు అధికారులకు వినతి పత్రం అందించడం జరుగుతుందని, సమస్యను పరిష్కరించకపోతే నవంబర్ నెలలో 17న జాక్ ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ముట్టడి చేపట్టి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.