BREAKING
ఐడి కార్డులు పంపిణీ చేసిన వైసిపి మండల అధ్యక్షులు కొత్త గూడ ఘనంగా విజయదశమి వేడుకలు స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు , కొండారెడ్డిపల్లిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు.. జెమ్మి చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు కల్వకుర్తి దసరా వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి.. రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఘనంగా దేవీ నవరాత్రులు ఈటల రాజేందర్ నివాసంలో ఘనంగా విజయదశమి వేడుకలు వైయస్సార్సీపి జడ్పీటీసీ అభ్యర్థిగా బోల్లెద్దు ప్రతాప్ కుమార్ -ప్రకటించిన వరికూటి భూమా నంద ఆశ్రమంలో వైభవంగా దుర్గమ్మ వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. వికసిత్‌ భారత్ లక్ష్య సాధనలో శ్రీరాముడి స్ఫూర్తిని పొందాలి గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన- సబ్ రిజిస్టర్ కార్యాలయానికి శంకుస్థాపన, స్టేడియం, ఈనెల 26న చలో హైదరాబాద్ కు వేలాదిగా తరలి రండి షాద్‌నగర్ 18వ వార్డులో ఘనంగా జమ్మి పూజ, రావణ దహనం.... స్థానిక ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు వైభవంగా బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామం లో శమి పూజలు...దసరా వేడుకలు...

మెడికవర్‌కు అనుకూలంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు , పరువు నష్టం కలిగించే ప్రచురణలపై ఆంక్షలు

Select Suryaa Now
మెడికవర్‌కు అనుకూలంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ,                     పరువు నష్టం కలిగించే ప్రచురణలపై ఆంక్షలు

 

హైదరాబాద్, మేజర్ న్యూస్ ప్రతినిధి :  మెడికవర్ హాస్పిటల్స్‌కు పరువు నష్టం కలిగించేలా లేదా ఇప్పటికే కోర్టు ముందుంచిన ప్రచురణలతో సమానమైన స్వభావం, ప్రభావం కలిగిన కంటెంట్‌ను ప్రచురించవద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ (మెడికవర్ హాస్పిటల్స్) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు పరిశీలనకు సమర్పించిన కథనాలు ప్రాథమికంగా పరువు నష్టం పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని, ఆసుపత్రి ప్రతిష్ఠకు భంగం కలిగించే స్వభావం కలిగి ఉన్నాయని పేర్కొంది. మన్నె క్రిశాంక్, హరీష్ రెడ్డి, శంకర్ గౌడ్‌లతో పాటు సంబంధిత మీడియా సంస్థలు, మధ్యవర్తులు, ఇతర పక్షాలు ఇటువంటి కంటెంట్‌ను ప్రచురించడం, పునఃప్రచురించడం చేయరాదని హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదుల వాదనలు వినే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ మధ్యంతర ఆదేశాలు అమల్లో ఉంటాయి. ఆరోగ్య రంగానికి సంబంధించిన వార్తలు, వ్యాఖ్యలు రోగుల విశ్వాసం, వైద్య సేవల ఎంపికపై ప్రభావం చూపగలవని మెడికవర్ పేర్కొంది. భావప్రకటనా స్వేచ్ఛ, స్వతంత్ర మీడియా ప్రాధాన్యతను గౌరవిస్తూనే, వాస్తవాల ఆధారంగా బాధ్యతాయుతమైన ప్రచురణలు ఉండాలని అభిప్రాయపడింది.

ఈ కేసులో మెడికవర్ తరఫున సీనియర్ న్యాయవాదులు ఎస్. రవి, కృష్ణ గ్రాంధి వాదనలు వినిపించగా, ఖైతాన్ అండ్ కో. ఎల్‌ఎల్‌పీ తరఫున షబ్బీర్ అహ్మద్, అనీష్ వేంపటి, వినమ్ర గోగియా, పి. వినయ్ కుమార్ సహకరించారు. రోగుల విశ్వాసాన్ని కాపాడుకుంటూ, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రాధాన్యత అని మెడికవర్ హాస్పిటల్స్ తెలిపింది.