మేడ్చల్ సిఎస్ఐ వెస్లీ చర్చిలో ఘనంగా యువజన ఆదివారపు ఆరాధన
మేడ్చల్ ,మేజర్ న్యూస్:మేడ్చల్ లోని సిఎస్ఐ వెస్లీ చర్చిలో చర్చి ఇన్‌చార్జ్ రెవరెండ్ జోసెఫ్ కిషోర్ మార్గదర్శకత్వంలో యువజన ఆదివారపు ఆరాధన భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా యువత ప్రదర్శించిన స్కిట్‌లు, ఆలపించిన ఆధ్యాత్మిక గీతాలు, దైవ వాక్యంతో ఆరాధన ఆశీర్వాదకరంగా సాగింది.ఈ కార్యక్రమంలో రెవరెండ్ సైరస్ సందేశమిస్తూ, సమాజంలో ఎదురయ్యే మంచి చెడు పరిస్థితులను విశ్వాసంతో ఎదుర్కొంటూ, క్రైస్తవ విలువలకు అనుగుణంగా జీవించాలని పిలుపునిచ్చారు. యువత నైతిక విలువలను అలవర్చుకుని, విశ్వాసంతో ముందుకు సాగాలని ఆయన సందేశం అందించారు.అనంతరం చర్చి సభ్యులు, యువత పరస్పర సహవాసంతో కలిసి భోజనం చేయడంతో కార్యక్రమం ఆనందంగా ముగిసింది. ఆరాధన ద్వారా యువతలో ఆధ్యాత్మిక చైతన్యం, ఐక్యత, క్రైస్తవ విలువల పట్ల నిబద్ధత పెంపొందించడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశంగా నిలిచింది.
రిపోర్టర్: తలారి శివకుమార్, మేడ్చల్.