BREAKING
ఏజెన్సీలో పోలీసుల విస్తృత కూంబింగ్ ఆపరేషన్లు ఐడి కార్డులు పంపిణీ చేసిన వైసిపి మండల అధ్యక్షులు కొత్త గూడ ఘనంగా విజయదశమి వేడుకలు స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు , కొండారెడ్డిపల్లిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు.. జెమ్మి చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు కల్వకుర్తి దసరా వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి.. రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఘనంగా దేవీ నవరాత్రులు ఈటల రాజేందర్ నివాసంలో ఘనంగా విజయదశమి వేడుకలు వైయస్సార్సీపి జడ్పీటీసీ అభ్యర్థిగా బోల్లెద్దు ప్రతాప్ కుమార్ -ప్రకటించిన వరికూటి భూమా నంద ఆశ్రమంలో వైభవంగా దుర్గమ్మ వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. వికసిత్‌ భారత్ లక్ష్య సాధనలో శ్రీరాముడి స్ఫూర్తిని పొందాలి గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన- సబ్ రిజిస్టర్ కార్యాలయానికి శంకుస్థాపన, స్టేడియం, ఈనెల 26న చలో హైదరాబాద్ కు వేలాదిగా తరలి రండి షాద్‌నగర్ 18వ వార్డులో ఘనంగా జమ్మి పూజ, రావణ దహనం.... స్థానిక ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

మేడ్చల్ సర్కిల్‌లో అభివృద్ధి పనులపై సిఎంసి కమిషనర్ సృజన క్షేత్రస్థాయి పరిశీలన

Select Suryaa Now
మేడ్చల్ సర్కిల్‌లో అభివృద్ధి పనులపై సిఎంసి కమిషనర్ సృజన క్షేత్రస్థాయి పరిశీలన
మేడ్చల్, మేజర్ న్యూస్:మేడ్చల్ సర్కిల్ పరిధిలో చేపట్టనున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులపై సిఎంసి కమిషనర్ సృజన క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. జోనల్ కమిషనర్, పింకేష్ కుమార్ డిప్యూటీ కమిషనర్ సుదాంష్ , ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి పలు ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.మేడ్చల్ బస్‌స్టాప్ వద్ద వర్షపు నీరు నిల్వ ఉండే సమస్యను పరిష్కరించేందుకు ప్రతిపాదించిన బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ ప్రాంతంలో డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రతిపాదనలను సమీక్షించి, పనుల పురోగతిపై దృష్టి సారించారు.
అనంతరం శివాజీ విగ్రహం జంక్షన్ వద్ద కొనసాగుతున్న జంక్షన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. అక్కడ చేపడుతున్న పనుల స్థితిగతులను తెలుసుకుని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో చర్చించారు.అలాగే అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించిన కేఎల్ఆర్ పార్కును సందర్శించి, స్థల పరిస్థితులను పరిశీలించారు. పార్కు అభివృద్ధికి సంబంధించి తదుపరి చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా గుర్తించిన డ్రైనేజీ సమస్యల పరిష్కారంతో పాటు ప్రతిపాదిత మౌలిక వసతుల పనులపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సిఎంసి కమిషనర్ అధికారులను ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ సుధాంష్ , ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షిస్తూ, సంబంధిత పనులపై తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.