మలక్ చించోలిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన
సూర్య, సారంగాపూర్ : మలక్ చించోలి గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దుర్గామాత ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి, ముధోల్ వారి సహకారంతో గురువారం నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 200 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి సమస్యలు ఉన్న వారిని గుర్తించి అవసరమైన వైద్య సలహాలు అందించారు. అవసరమైన దాదాపు 20 మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.ఈ శిబిరంలో కంటి వైద్యా నిపుణులు,లక్ష్మణ్,ఓం ప్రకాష్,శంకర్,దుర్గామాత కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.