BREAKING
29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ...... నగరంలో కూటమి ప్రచార బేరి

మహాలక్ష్మి అవతారంలో ఏడుపాయల వనదుర్గామాత

Select Suryaa Now
మహాలక్ష్మి అవతారంలో ఏడుపాయల వనదుర్గామాత

పాపన్నపేట ; ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వనదుర్గాభవాని అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం నాడు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా అమ్మవారిని పెసర రంగు వస్త్రాలతో అత్యంత సుందరంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక మండపంలో అలంకరించిన అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
నవరాత్రి ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.