BREAKING
ఉక్రెయిన్ కాల్పుల విరమణ ప్రతిపాదనకు బల్గేరియా మద్దతు.. శాంతి స్థాపన దిశగా కీలక ముందడుగు! ఉక్రెయిన్ కాల్పుల విరమణ ప్రతిపాదనకు బల్గేరియా మద్దతు.. శాంతి స్థాపన దిశగా కీలక ముందడుగు! ముడి చమురు ధరలపై ప్రపంచ దేశాల దృష్టి.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఇంధన మార్కెట్లలో ఆందోళన! ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు ప్రారంభం చైనా స్టాక్ మార్కెట్లలో భారీ పుంజుకోవడం.. ప్రభుత్వ ఉద్దీపన చర్యలతో ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహం! డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడి.. విమానయాన రంగంలోకి అదానీ గ్రూప్ అడుగులు.. ఎయిర్‌లైన్స్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు తీవ్ర ఆసక్తి! బంగ్లాదేశ్ సంక్షోభంతో భారత్‌కు పెరుగుతున్న దుస్తుల తయారీ ఆర్డర్లు.. దేశీయ పరిశ్రమకు కలిసొస్తున్న అవకాశం! యాదమరిలో ఎన్నికల బందోబస్తుకు 100 మంది పోలీసులు దేశ సేవే లక్ష్యంగా బీజేపీ నిరంతర కృషి: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రానికి ఖర్గే హెచ్చరిక డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు మేకల కాస్తుండగా రైలు ఢీకొని ఓ మహిళా మృతి.. మాల్దీవుల వెకేషన్ ఫొటోలతో ఆకట్టుకుంటున్న నటి సాక్షి మాలిక్.. గ్లామర్ లుక్ వైరల్

లక్షెట్టిపేటలో రూ.10 నాణేలతో హోండా యాక్టివా కొనుగోలు!

Select Suryaa Now
లక్షెట్టిపేటలో రూ.10 నాణేలతో హోండా యాక్టివా కొనుగోలు!

సూర్య, లక్షెట్టిపేట: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఓ వ్యక్తి కేవలం రూ.10 నాణేలు చెల్లించి కొత్త హోండా యాక్టివా 125 సీసీ స్కూటీని కొనుగోలు చేయడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.

లక్షెట్టిపేటలోని వడ్లవాడకు చెందిన రవి జోసెఫ్ వినూత్నంగా ఆలోచించి అందరి దృష్టిని ఆకర్షించారు. స్థానిక జగదాంబ హోండా షోరూంలో రూ.1,23,000 విలువైన హోండా యాక్టివా 125 సీసీ స్కూటీని కొనుగోలు చేశారు. ఈ వాహనం కొనుగోలు కోసం అవసరమైన మొత్తం నగదును రూ.10 నాణేల రూపంలోనే చెల్లించారు.

షోరూం నిర్వాహకులు పల్లెర్ల గణేష్ కుమార్, కటకం రమేష్‌లకు ఆయన ఈ నాణేలను అందజేశారు. సాధారణంగా నోట్ల రూపంలో జరిగే వాహన కొనుగోలుకు భిన్నంగా, పూర్తిగా రూ.10 నాణేలతో స్కూటీ కొనుగోలు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.