BREAKING
*ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడాలి... జిల్లా కలెక్టర్ఆశీష్ సంఘ్వాన్ ఎస్‌బీఐ చిన్న, మధ్యతరహా వ్యాపార రుణ పరిమితి పెంపు.. ఎంఎస్‌ఎంఈ రంగానికి భారీ ఊతం! నేడు మండలానికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాక శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ ఆలయ వార్షిక మహోత్సవం దేశీయ స్టాక్ మార్కెట్లలో వారాంతపు నష్టాలు.. ఆఖరి రోజు అమ్మకాల ఒత్తిడితో కుదేలైన సూచీలు! దేశీయ స్టాక్ మార్కెట్లలో వారాంతపు నష్టాలు.. ఆఖరి రోజు అమ్మకాల ఒత్తిడితో కుదేలైన సూచీలు! అండర్  గ్రౌండ్ డ్రైనేజీ  పనులు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉండి సేవ చేయాలి

కొత్తూరులో బీఆర్‌ఎస్‌ గ్రామశాఖ సమావేశం

Select Suryaa Now
కొత్తూరులో బీఆర్‌ఎస్‌ గ్రామశాఖ సమావేశం
 
సూర్య నందిపేట్ :నందిపేట మండలం కొత్తూరు గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) గ్రామశాఖ సర్వసభ్య సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు మచ్చర్ల సాగర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆదేశాల మేరకు సమావేశంలో సంస్థాగత బలోపేతంపై చర్చించారు. ఇందులో భాగంగా ప్రతి 60 ఓట్లకు ఒక పార్టీ ఇన్‌చార్జిని నియమించారు.
ఈ సందర్భంగా మచ్చర్ల సాగర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హయాంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇన్‌చార్జులకు సూచించారు. గత మూడేళ్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రజా సమస్యలపై గ్రామస్థాయిలో చర్చిస్తూ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెనిద్ర పాదయాత్ర కార్యక్రమం నందిపేట మండలం కొత్తూరు గ్రామంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో సీనియర్‌ నాయకులు బాలగంగాధర్‌, యువ నాయకుడు భరత్‌, వార్డు సభ్యులు పాషా, తాటికాయల సాగర్‌, గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ బాబురాజ్‌, గణేష్‌, సాయిరెడ్డి, దామోదర్‌, రవి, సాయికుమార్‌, ప్రభాకర్‌, భోజన్న, లింబాద్రి, శ్రీనివాస్‌, సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.