ఖాజీపూర్ యువకులకు టీ షర్టుల అందజేసిన నార్యా నాయక్
మద్దూరు, సూర్య న్యూస్
మద్దూరు మండల పరిధిలోని ఖాజీపూర్ గ్రామ యువకులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు దేవుల నాయక్ సోదరుడు నార్యా నాయక్ టీ షర్టులను పంపిణీ చేశారు. యువతతో మమేకమవుతూ వారి అభ్యర్థన మేరకు టీ షర్టులు అందజేసినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా గ్రామ యువకులు టీ షర్టుల పంపిణీ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, వారి కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.