BREAKING
రేపల్లె మండలంలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల ఈనెల 21 నుండి 23 వరకు నామినేషన్లు స్వీకరణ మండల పరిషత్తు ఆర్వో నాగయ్య నాటుసారా పట్టివేత బోరేగావ్‌లో వైభవంగా బతుకమ్మ వేడుకలు రేపల్లె మున్సిపాలిటీ లో 8 నామినేషన్లు తిరస్కరణ 173 సక్రమం. అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే సాంబశివరావు కార్మిక హక్కుల సాధన కోసం మహా ధర్నా -- చలో హైదరాబాద్ జయప్రదం చేయాలి లాడ్జీల్లో ఎస్. ఐ తనిఖీలు నర్సాపూర్ దౌల్తాబాద్ మెయిన్ రోడ్డు పక్కన మిషన్ భగీరథ నీళ్లు లీకేజీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్‌ సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు మిలిగిరిపేట గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు భక్తులు పాలిట కొంగుబంగారమైన నిలిచిన రామగిరి గంగమ్మ!! సాఫ్ట్‌బాల్‌ పురుషులు, మహిళల ప్రాబబుల్స్‌ జట్ల ఎంపిక ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలి రేపల్లె డిఎస్పి అబ్దుల్ అజీద్ వైసిపి అరాచకాలను మర్చిపోయి ఎంపీ అవినాష్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

కలామ్ జీవితం ఆదర్శనీయం:

Select Suryaa Now
కలామ్ జీవితం ఆదర్శనీయం:

సూర్య,  నిర్మల్ ప్రతినిధి :జిల్లా కేంద్రంలోని ఈద్గాం చౌరస్తా వద్ద డా. ఏపీజే అబ్దుల్ కలామ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ మాట్లాడుతూ.. దేశానికి కలామ్ చేసిన నిస్వార్థ సేవలు చిరస్మరణీయమని, విద్యార్థులకు ఆయన జీవితం ఆదర్శప్రాయమని అన్నారు. ఈద్గాం చౌరస్తా వద్ద కలామ్ కాంస్య విగ్రహంతో పాటు క్షిపణి నమూనాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన కలామ్, అణు శక్తి రంగంలో భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు, యువకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.