BREAKING
వైభవంగా సాయిబాబా మహాసమాధి ఉత్సవం కొత్తూరులో వైభవంగా విజయదశమి వేడుకలు ఎంపీటీసీ నామినేషన్ల వేళ పోలీసు ఆంక్షలు. రొంపిచెర్ల మండల ప్రజలు సహకరించాలి సీతారాంబాగ్ రామ్‌ మైదానంలో ఉద్రిక్తత.. మదనపల్లి అభివృద్ధికై డాక్టర్ అప్సర్ షరీఫ్ ని గెలిపించండ : డిసిసి అధ్యక్షులు గాజుల భాస్కర్ పిలుపు బీరప్ప స్వామి ఆలయంలో వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ప్రత్యేక పూజలు కురుబ కులస్తుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు.. రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం వాహన, ఆయుధ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అమర్ అంజన్నకు సీఎం ప్రత్యేక పూజలు వైభవంగా శ్రీవారి చక్రస్నానం ప్రధాని నివాసం సమీపంలోని చారిత్రక రేస్ కోర్స్ మసీదుకు ఎవిక్షన్ నోటీసు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు జోక్యాన్ని కోరిన అసదుద్దీన్ ఒవైసీ! చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా.. డాక్టర్ గడల శ్రీనివాసరావు కస్టడీ పొడిగింపుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా: ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వుల సవాలు! గుజరాత్‌లో నాలుగు ఘోర రోడ్డు ప్రమాదాలు: విధుల్లో ఉన్న పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ సహా 11 మంది దుర్మరణం! గ్రేటర్ నోయిడాలో 19వ రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌పో: 1,080 మంది ఎగ్జిబిటర్లతో స్వచ్ఛ ఇంధన సాంకేతికతల ప్రదర్శన! ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతో కాంగ్రెస్ బెంబేలు: బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ తీవ్ర వ్యాఖ్యలు!

కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా: ఎంపీ ఈటల రాజేందర్

Select Suryaa Now
కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా: ఎంపీ ఈటల రాజేందర్


కీసర, మేజర్ న్యూస్ : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, కాలనీల్లో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కీసర సర్కిల్ పరిధిలోని చీర్యాల జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎమ్‌ కాలనీలో శనివారం పర్యటించిన ఆయన నూతనంగా ఏర్పాటు చేసిన పిల్లల పార్క్, ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు. అనంతరం స్థానికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, కాలనీ ఏర్పడి 18 ఏళ్లు గడుస్తున్నా శాశ్వత తాగునీటి సౌకర్యం, అంగన్‌వాడీ కేంద్రం, రేషన్ దుకాణం, శ్మశానవాటిక వంటి కనీస వసతులు లేకపోవడం విచారకరమన్నారు. కాలనీలో ఎవరైనా మృతి చెందితే సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని చీర్యాల శ్మశానవాటికకు వెళ్లాల్సి వస్తోందని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల తీవ్రతను గుర్తించిన ఈటల రాజేందర్ సంబంధిత అధికారులతో మాట్లాడి కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు, సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కీసర డివిజన్ అధ్యక్షుడు కోల బలరాజ్ యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జిల్లాల తిరుమల రెడ్డి, మాజీ సర్పంచ్ కోల అశోక్ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏలూరు సత్యనారాయణ ముదిరాజ్, నాయకులు డొంకెనీ శాలిని రమేష్ గౌడ్, బర్లపాటి ఆంజనేయులు, కోల మల్లేష్ యాదవ్, కందాడి ప్రభాకర్ రెడ్డి, కాలనీ అధ్యక్షుడు సంపత్ గుప్త, దినేశ్ రెడ్డి, వేణు, కిరణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.