BREAKING
కొత్తూరులో వైభవంగా విజయదశమి వేడుకలు ఎంపీటీసీ నామినేషన్ల వేళ పోలీసు ఆంక్షలు. రొంపిచెర్ల మండల ప్రజలు సహకరించాలి సీతారాంబాగ్ రామ్‌ మైదానంలో ఉద్రిక్తత.. మదనపల్లి అభివృద్ధికై డాక్టర్ అప్సర్ షరీఫ్ ని గెలిపించండ : డిసిసి అధ్యక్షులు గాజుల భాస్కర్ పిలుపు బీరప్ప స్వామి ఆలయంలో వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ప్రత్యేక పూజలు కురుబ కులస్తుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు.. రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం వాహన, ఆయుధ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అమర్ అంజన్నకు సీఎం ప్రత్యేక పూజలు వైభవంగా శ్రీవారి చక్రస్నానం ప్రధాని నివాసం సమీపంలోని చారిత్రక రేస్ కోర్స్ మసీదుకు ఎవిక్షన్ నోటీసు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు జోక్యాన్ని కోరిన అసదుద్దీన్ ఒవైసీ! చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా.. డాక్టర్ గడల శ్రీనివాసరావు కస్టడీ పొడిగింపుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా: ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వుల సవాలు! గుజరాత్‌లో నాలుగు ఘోర రోడ్డు ప్రమాదాలు: విధుల్లో ఉన్న పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ సహా 11 మంది దుర్మరణం! గ్రేటర్ నోయిడాలో 19వ రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌పో: 1,080 మంది ఎగ్జిబిటర్లతో స్వచ్ఛ ఇంధన సాంకేతికతల ప్రదర్శన! ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతో కాంగ్రెస్ బెంబేలు: బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ తీవ్ర వ్యాఖ్యలు! పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ

కాలనీల సమస్యలను పరిష్కరించాలి:ఎంఎంసీ కమిషనర్‌కు ఎమ్మెల్యే మల్లారెడ్డి వినతి

Select Suryaa Now
కాలనీల సమస్యలను పరిష్కరించాలి:ఎంఎంసీ కమిషనర్‌కు ఎమ్మెల్యే మల్లారెడ్డి వినతి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని నాగారం, జవహర్‌నగర్ డివిజన్లలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కోరారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడటంతో పాటు, ఆయన కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాగారం, జవహర్‌నగర్ డివిజన్లలో డ్రైనేజీ వ్యవస్థ, వీధిదీపాలు, సీసీ రోడ్లు, పారిశుధ్యం తదితర సమస్యలను కమిషనర్‌కు వివరించారు. ఆయా కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, సమస్యల పరిష్కారానికి మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.ఎమ్మెల్యే మల్లారెడ్డి వినతిపై కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సానుకూలంగా స్పందించారు. సంబంధిత సమస్యలను పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.