BREAKING
అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ విడుదల తేదీ ఖరారు: ఏడాది నిరీక్షణ తర్వాత థియేటర్లలోకి వస్తున్న సరికొత్త చిత్రం అనిరుధ్ వివాహ వేడుకలో రజనీకాంత్ సందడి: ‘మనసిలాయో’ సాంగ్‌కు అదిరిపోయే డ్యాన్స్, వీడియో వైరల్ పట్టాలెక్కిన అత్యాధునిక ‘అమృత్ భారత్ 3.0’ సిటీ కోసం ఇది చేయాల్సిందే: తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణపై నటుడు నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు మైత్రి రవిశంకర్ పై దర్శకుడు బుచ్చిబాబు ఫన్నీ కామెంట్స్: ఈవెంట్‌కు పది వేలు ఇవ్వండి ప్లీజ్ ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. వందేళ్ల కలను సాకారం చేసిన ఎమ్మెల్యే అమిలినేని. పండుగ వాతావరణం లో జల హారతి. భూభారతి రీ-సర్వేపై గ్రామసభలు చిన్నారుల్లో న్యుమోనియా నివారణపై అవగాహన కార్యక్రమం నమ్మకమైన భాగస్వామి ఉంటే విజయాలు తథ్యం: సీఎం చంద్రబాబు శంషాబాద్ ఎమ్మార్వో పిటీషన్ కొట్టివేసిన హైకోర్టు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం భూ రీ సర్వేకు రైతులు సహకరించాలి పత్త లేని అత్తాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి! వికలాంగుల సంఘాలకు అవకాశం కల్పించాలి

కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు రూ.36 కోట్లతో అభివృద్ధి పనులు

Select Suryaa Now
కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు రూ.36 కోట్లతో అభివృద్ధి పనులు

సూర్య,కాగజ్‌నగర్ :కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు రూ.36 కోట్ల నిధులతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సికింద్రాబాద్ డివిజన్ రైల్వే డీఆర్ఎం డాక్టర్ గోపాలకృష్ణన్ వెల్లడించారు. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.గురువారం కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌ను సందర్శించిన డీఆర్ఎంను సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మర్యాదపూర్వకంగా కలిసి పలు వినతిపత్రాలు అందజేశారు. ముఖ్యంగా రెండో, మూడో నంబర్ ప్లాట్‌ఫారాలపై ప్రయాణికులకు అదనపు సౌకర్యాలు కల్పించాలని, లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై డీఆర్ఎం సానుకూలంగా స్పందించారు.అదేవిధంగా బెంగాలీ ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ నుంచి కాగజ్‌నగర్ మీదుగా హౌరా వరకు కొత్త రైలు నడపాలని ఎమ్మెల్యే కోరారు. లక్నో, భగత్ కీ కోఠి ఎక్స్‌ప్రెస్‌లకు కాగజ్‌నగర్‌లో నిలుపుదల కల్పించాలని, ప్రయాణికుల నుంచి మంచి స్పందన పొందుతున్న వందేభారత్ రైలుకు అదనపు బోగీలు జత చేయాలని విజ్ఞప్తి చేశారు.సిర్పూర్ రైల్వే స్టేషన్‌లో కాజీపేట–బల్లార్షా ఎక్స్‌ప్రెస్‌కు నిలుపుదల కల్పించాలని, కాగజ్‌నగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను సిర్పూర్ టౌన్ వరకు పొడిగించాలని, బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రారంభించిన ప్రత్యేక రైలును శాశ్వతంగా కొనసాగించాలని కోరారు.రూ.36 కోట్ల అభివృద్ధి పనులు పూర్తయితే కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో రైలు యాత్రి సేవా సమితి సభ్యులు పవన్ బళ్దేవా, అరుణ్ లోయ, ప్రయాగ్ తివారి, అనిల్ కుమార్, రైల్వే సీనియర్ డీఈఎన్ అభిరామ్, సీనియర్ డీఓఎం తదితర అధికారులు పాల్గొన్నారు.