BREAKING
నేడే దేవరగట్టులో కర్రల ఉత్సవం... శిరిడి సాయిబాబాను దర్శించుకున్న రాష్ట్ర చైర్మన్ వరుసగా నాలుగో రోజు పడిపోయిన బంగారం ధరలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సైబర్ దాడి దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడుతున్నాం రిపబ్లికన్లు అన్ని అంచనాలను తలకిందులు చేస్తారన్న డొనాల్డ్ ట్రంప్ భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మందమర్రిలో వైభవంగా రామ్‌లీలా ఉత్సవాలు పోలీసు సిబ్బంది సేవలు దేశానికి వెలకట్టలేనివని ప్రధాని మోదీ ప్రశంస వాల్‌స్ట్రీట్ బలమైన ఫలితాలతో దూసుకెళ్తున్న ఆసియా మార్కెట్లు పసిఫిక్ ఐలాండ్స్ ఫోరమ్ భాగస్వామిగా ఇజ్రాయెల్ గుర్తింపు వాకర్స్‌తో మమేకం.. నగరాభివృద్ధికి భరోసా పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి బీసీ రమేష్‌ గౌడ్‌ రూపాయి మారకం విలువలో స్వల్ప ఊపు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు: పెరుగుతున్న చైనా తప్పుడు సమాచార ప్రచారంపై భద్రతా ఏజెన్సీ హెచ్చరిక

జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ స్నేహ మెహ్రా

Select Suryaa Now
జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ స్నేహ మెహ్రా

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు నింపాలని, ప్రతి కుటుంబం ఆనందంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగ నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ఈ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రయాణాల సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. జిల్లా ప్రజలందరూ పరస్పర ప్రేమాభిమానాలు, సోదరభావంతో పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ స్నేహ మెహ్రా ఆకాంక్షించారు.