BREAKING
యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ 'భామ సుందరలో' కొత్త జానపద పాట! 29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ......

జిల్లా పోలీస్ కార్యాలయంలో.... ఘనంగా ఆయుధ, వాహన పూజలు.

Select Suryaa Now
జిల్లా పోలీస్ కార్యాలయంలో.... ఘనంగా ఆయుధ, వాహన పూజలు.



నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్...
విజయదశమిపర్వదినాన్ని  పురస్కరించుకుని నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో సోమవారం ఆయుధ పూజలు, ఎం.టి. విభాగంలో వాహన పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక పూజలు నిర్వహించి, జిల్లా ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అని పేర్కొన్నారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ తదితర అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ విజయపథంలో ముందుకు సాగాలని కోరుకున్నారు. ప్రజలందరూ పరస్పర ప్రేమాభిమానాలతో, సోదరభావంతో పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో ఆయుధ పూజ నిర్వహించి, విధి నిర్వహణలో కీలక పాత్ర పోషించే ఆయుధాలకు సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. శక్తికి, ధైర్యానికి, విజయానికి ప్రతీకగా నిలిచే దుర్గామాతను ప్రార్థిస్తూ, పోలీస్ సిబ్బంది ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో మరింత అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా ఎం.టి. విభాగంలో పోలీస్ వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, అత్యవసర సమయాల్లో సత్వర సేవలు అందించడంలో పోలీస్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు.విజయదశమి పండుగ పోలీస్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కూడా సుఖసంతోషాలు, ఆరోగ్యం, విజయాలను అందించాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. ప్రజల సహకారంతో నల్లగొండ జిల్లాలో శాంతిభద్రతలను మరింత పటిష్టంగా కొనసాగిస్తూ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్బీ సీఐ నాగరాజు, డీసీఆర్‌బీ సీఐ శ్రీను నాయక్, నల్లగొండ వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ ఎస్ఐ సైదా బాబు, ఆర్‌ఐలు సంతోష్, శ్రీను, నరసింహ, సరప్ప నాయుడు, హరిబాబు, కళ్యాణ్ రాజ్ తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.