BREAKING
ఐడి కార్డులు పంపిణీ చేసిన వైసిపి మండల అధ్యక్షులు కొత్త గూడ ఘనంగా విజయదశమి వేడుకలు స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు , కొండారెడ్డిపల్లిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు.. జెమ్మి చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు కల్వకుర్తి దసరా వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి.. రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఘనంగా దేవీ నవరాత్రులు ఈటల రాజేందర్ నివాసంలో ఘనంగా విజయదశమి వేడుకలు వైయస్సార్సీపి జడ్పీటీసీ అభ్యర్థిగా బోల్లెద్దు ప్రతాప్ కుమార్ -ప్రకటించిన వరికూటి భూమా నంద ఆశ్రమంలో వైభవంగా దుర్గమ్మ వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. వికసిత్‌ భారత్ లక్ష్య సాధనలో శ్రీరాముడి స్ఫూర్తిని పొందాలి గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన- సబ్ రిజిస్టర్ కార్యాలయానికి శంకుస్థాపన, స్టేడియం, ఈనెల 26న చలో హైదరాబాద్ కు వేలాదిగా తరలి రండి షాద్‌నగర్ 18వ వార్డులో ఘనంగా జమ్మి పూజ, రావణ దహనం.... స్థానిక ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు వైభవంగా బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామం లో శమి పూజలు...దసరా వేడుకలు...

జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రకృతిలో లభించే రంగురంగుల పూలను పేర్చి దేవతగా పూజింపబడే బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు.  జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం అడ గ్రామంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొమరం భీమ్ ప్రాజెక్టు ఒడ్డున జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలను జిల్లా ఎస్పీ నితి కా పంత్ జిల్లా అటవీ శాఖ అధికారి జిల్లా అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం. డేవిడ్ కాగజ్నగర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు లతో కలిసి గౌరమ్మను పూజించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలను ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన కొమరం భీమ్ ప్రాజెక్ట్ ఒడ్డున నిర్వహించడం ద్వారా ఈ ప్రాంతం యొక్క విశిష్టతను ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. బతుకమ్మ పండుగ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చాటి చెబుతుందని, మహిళల ఐక్యతకు, ప్రకృతి పట్ల ఆరాధనకు, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఈ బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించాలని, సాంప్రదాయమైన పాటలు పాడుతూ, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం చాలా సంతోషకరమని తెలిపారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.ఈ కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా పౌర సంబంధాల అధికారి వై. సంపత్ కుమార్, ఐ కె పి సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.