జగదంబ సెంటర్ లో గుంతలను చదును చేయించిన 16 వ వార్డు వార్డు కౌన్సిలర్
సూర్య ఇల్లందు,ఇబ్బందికరంగా మారిన రోడ్డును ఇల్లందు మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ ఉల్లింగ విజయలక్ష్మి సతీష్ చొరవ తీసుకుని గ్రావెల్ వేయించి చదును చేయించారు.
స్థానిక జగదాంబ సెంటర్ 16వ వార్డుకు వెళ్లే దారిలో గత కొన్ని రోజులుగా రోడ్డుపై గుంతలు పడి నడవడానికి, వాహనాలు వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉండేది.
దీని మూలంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన కౌన్సిలర్ విజయలక్ష్మి వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. గ్రావెల్ వేయించడం ద్వారా రాకపోకలకు ఇబ్బందులు తగ్గేలా రోడ్డును తాత్కాలికంగా సరిచేయించారు.
సూర్య రిపోర్టర్ రాజేష్ ఇల్లందు